Koratala Shiva : ఆర్ ఆర్ ఆర్ ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా మీద అందరి ఆసక్తి ఉంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తీయబోతున్నట్లు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూన్ నెలలో మొదలు అవుతుంది అన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది ఈ సినిమాని మొదట అల్లు అర్జున్ తో తీయాలనుకుని క్యాన్సిల్ కావడంతో తర్వాత తారక్ తో తీస్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నారు అని, రీసెంట్ పొలిటికల్ ఈ సినిమాలో చూపించబోతున్నారు అని, ఎన్టీఆర్ యంగ్ పొలిటిషన్ గా కనిపిస్తారు అని చాలా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ అన్నిటికీ దర్శకుడు కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో చెక్ పెట్టేసారు. ఎన్టీఆర్ కొట్టాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కొరటాల శివ, ఈ సినిమా సంబంధించిన కథ, కాన్సెప్ట్ విషయంలో చిన్న క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా లోపాలిటిక్స్ అంశానికి తావు లేదు అని, కాకపోతే ఇప్పటి వరకూ తారక్ ను ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో నేను చూపిస్తానని కొరటాల చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమాని జనతా గ్యారేజ్ సినిమా సమయంలోనే తారకు చెప్పానని అప్పుడే ఓకే అయిందని చెప్పారు.
ఈ సినిమాకు సంబంధించిన కథ నా కెరీర్ లోనే అతిపెద్ద కథగా రాసుకున్నట్టు శివ చెప్పారు.భారీ ఎమోషన్స్, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో కథను సిద్ధం చేసుకున్నట్టు శివ తెలియజేసారు. అయితే ఇది పాన్ ఇండియా సినిమానా అని అడగగా పాన్ ఇండియా సినిమా అంటే తనకు నచ్చదని కథ పెద్దగా ఉంటే దేశం మొత్తం చూస్తుంది అని తను అభిప్రాయపడ్డారు. అయితే ఎన్టీఆర్ తీయబోయే సినిమా కథ కూడా భారీగా ఉంటుందని చెప్పారు అంటే ఇండియా ఎలివేషన్స్ మన తీయబోతున్నట్లు తెలుస్తుంది.