Tollywood Directors: యాక్షన్ డైరెక్టర్ బోయపాటి..కొరటాల మధ్య ఉన్న వివాదం ఏంటో మీకు తెలుసా?

Tollywood Directors: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత హీరో హీరోయిన్లు డైరెక్టర్లు నిర్మాతల మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇకపోతే యాక్షన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బోయపాటి శీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే మరొక లెజెండరీ డైరెక్టర్ కొరటాల శివ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి దర్శకత్వంలో సినిమా అంటే ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకుంటారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వీరిద్దరు నటుడు పోసాని కృష్ణ మురళికి సమీప బంధువులు. స్వయంగా పోసాని వీరిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇలా బంధువులైన వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి గల కారణం బాలకృష్ణ నటించిన సింహా సినిమా అని చెప్పాలి. కొరటాల శివ దర్శకుడు కాకముందు రచయితగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సింహ సినిమా కథ విషయంలో కొరటాల ఎంతో సహాయం చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల సమయంలో కొరటాల పేరు ఎక్కడ ప్రస్తావించకపోవడంతో ఈ విషయం గురించి వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి కొరటాల బోయపాటిని ప్రశ్నించగా కథ విషయంలో చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు. వారందరి పేర్లు ప్రస్తావించడం కుదరదంటూ చెప్పినట్లు కొరటాల శివ శ్రీమంతుడు సినిమా సక్సెస్ తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. సింహ సినిమా నుంచి ఇద్దరికీ డైరెక్టర్ల మధ్య ఈ వివాదం అలాగే కొనసాగుతూ వచ్చింది.