ఇదెక్క‌డి అరాచ‌కం.. సాంగ్ కోసం గ‌ర్భ‌వ‌తి అంటూ ప‌బ్లిసిటీ స్టంట్

సినిమాలు, సాంగ్స్ ప్ర‌మోష‌న్ కోసం ఈ మ‌ధ్య న‌టీన‌టులు కొత్త పుంత‌లు తొక్కుతున్నారు. బిగ్ బాస్ బ్యూటీ పున‌ర్న‌వి వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఎంగేజ్‌మెంట్ అయిన‌ట్టు డ్రామా ఆడింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఫేమ‌స్ సింగ‌ర్ నేహ కక్క‌ర్ పెళ్లి అయిన రెండు నెల‌ల‌కు గ‌ర్భ‌వ‌తి అంటూ అంద‌రిని అయోమ‌యంలో ప‌డేసింది. తీరా ఏంద‌ని ఆరా తీస్తే ఓ సాంగ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇదొక ప‌బ్లిసిటీ అని తేలింది.

వివ‌రాల‌లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్‌ గాయని నేహా కక్కర్ గత అక్టోబర్‌ 24న ఢిల్లీలోని గురుద్వార్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రోహన్ ప్రీత్‌ ని వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత ఇద్ద‌రు హ‌నీమూన్‌కు వెళ్ళ‌గా అక్క‌డ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అంద‌రిని అల‌రించారు. ఇక రీసెంట్‌గా బేబి బంప్ ఫొటోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన నేహా అంద‌రికి షాక్ ఇచ్చింది . రోహాన్ కూడా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బేబి బంప్‌తో ఉన్న వైఫ్‌తో క‌లిసి ఫోటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇప్పుడు మ‌రింత కేర్ తీసుకోవాలి అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నెటిజ‌న్స్‌లో అనేక అనుమానాలు తలెత్తాయి. పెళ్ళైన రెండు నెల‌లకే గ‌ర్భ‌వ‌తా అంటూ ముక్కున వేలేసుకున్నారు.

కపిల్‌శర్మ సహా మరికొందరు సెలబ్రిటీలు సైతం వీరికి శుభాకాంక్షలు తెలిపారు. క‌ట్ చేస్తే ‘ఖ్యాల్‌ రఖ్యా కర్‌’‌ అనే లేటెస్ట్‌ సాంగ్ కోసం నేహా గర్భవతిగా నటించింది. దీని ప్ర‌మోష‌న్‌లో భాగంగా నేహా దంప‌త‌లు ఇలాంటి డ్రామా ఆడారు. డిసెంబర్‌22న ఈ పాట విడుదల కానుంది. ‘ఇండియన్‌ ఐడల్‌’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్‌.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాలా చష్మా, దిల్‌బర్‌ రీమిక్స్‌ వంటి ఎన్నో పాటలతో అల‌రించిన నేహా క‌క్క‌ర్ ప్రముఖ మ్యూజిక్‌ షో ఇండియన్‌ ఐడల్‌ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది.