పెళ్ళి అయి రెండు నెల‌లు కాలేదు.. గ‌ర్భ‌వ‌తిని అయిన‌ట్టు ప్ర‌క‌టించిన ఫేమ‌స్ సింగ‌ర్

ఇదెక్క‌డి దారుణం.. పెళ్లై క‌నీసం రెండు నెల‌లు కాలేదు, అప్పుడే ప్ర‌గ్నెంట్ అని ప్ర‌క‌టించుకుంది ఫేమ‌స్ సింగ‌ర్ నేహ క‌క్క‌ర్. అక్టోబ‌ర్ 24న రోహ‌న్ ప్రీత్ సింగ్ అనే సింగ‌ర్‌ని పెళ్లి చేసుకున్న నేహ ఆ హంగామాకి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. హ‌ల్దీ, మెహందీ, సంగీత్ అంటూ ఈ జంట చేసిన ర‌చ్చ‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. అయితే తాజాగా నేహా త‌న బేబి బంప్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసి తాను గ‌ర్భ‌వ‌తిని అని ప్ర‌క‌టించ‌డంతో అంతా షాక్ అయ్యారు.

Neha Bab | Telugu Rajyam

పెళ్ళికి ముందే రోహాన్ ప్రీత్ సింగ్‌తో డేటింగ్‌లో ఉంది నేహ‌. ఆ స‌మ‌యంలో ఈవిడ గ‌ర్భం దాల్చి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌గ్నెంట్ అయిన కార‌ణంగానే నేహ‌- రోహాన్‌లు ఉరుకుల ప‌రుగుల మీద పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత హ‌నీమూన్ కోసం విదేశాల‌కు వెళ్లారు. అక్క‌డ దిగిన అంద‌మైన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు థ్రిల్ క‌లిగించారు. అయితే నేహా క‌క్క‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌గ్నెన్సీ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. రోహన్ ప్రీత్ సింగ్ తనను ఎంతో కేరింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

రోహ‌న్ ప్రీత్ సింగ్ కూడా త‌న భార్య గ‌ర్బ‌వ‌తి అన్న విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. నేహాని జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌ల‌సిన స‌మ‌యం వ‌చ్చింది. కొత్త అతిథి కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నాం అని పేర్కొన్నారు. రీసెంట్‌గా క‌పిల్ శ‌ర్మ షోకు హాజ‌రైన ఈ జంట త‌మ ముద్దు ముచ్చ‌ట్ల విష‌యాన్ని పంచుకున్నారు. నేహా గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో ఆమెకు అభిమానులు, సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles