బాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్స్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శెట్టి జంట ఒకటి. పెళ్ళి దగ్గర నుండి వర్క్, పర్సనల్ లైఫ్‌ని సజావుగా సాగిస్తూ వస్తున్న ఈ జంట ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆసీస్‌తో జరుగుతున్న వన్డే, టీ 20 మ్యాచ్‌లో భాగంగా ఈ దంపతులు రీసెంట్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లారు. అనుష్క జనవరిలో పండంటి బేబీకు జన్మనివ్వనున్న నేపథ్యంలో టెస్ట్ సిరీస్ ఆడకుండానే కోహ్లీ ఇండియాకి రానున్నాడు. అయితే మాతృత్వంలో ఉన్న మాధుర్యాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తున్న అనుష్క తరచు తన బేబిబంప్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
బేబిబంప్‌తో వెరైటీ డ్రెస్‌లలో మెరుస్తున్న అనుష్కని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అయితే అనుష్క ప్రస్తుత ఆరునెలల గర్భవతి కాగా, ఆమె శీర్షాసనం వేసి అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తలకు కిందకు కాళ్లు పైకి పెట్టి వేసే ఈ ఆసనంలో కోహ్లీ సాయపడ్డాడు. ఈ ఆసనం చాలా క్లిష్టమైనది అని అంటున్న అనుష్క.. యోగా నా జీవితంలో భాగం అయిపోయింది. అందుకే డాక్టర్ సలహాతో గర్భవతిగా ఉన్న నేను పలు ఆసనాలు వేస్తున్నాను.
యోగా టీచర్ ఈఫా ష్రాఫ్‌తోపాటు నా భర్త విరాట్ కోహ్లి ఈ శీర్షాసనం వేయడానికి సాయం చేశారని అనుష్క ఆ పోస్ట్‌లో కామెంట్ చేసింది. ఏదేమైన ఈ సమయంలో అనుష్క ఇలాంటి ఫీట్స్ చేయకపోవడమే మంచిదని అభిమానులు సూచనలు చేస్తున్నారు. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే జీరో సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు.కేవలం నిర్మాతగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్‌లో అనుష్క కథానాయికగా నటిస్తుందని ప్రచారం జరుగుతున్న ఇందులో పూర్తి క్లారిటీ లేదు.