మర్చిపోయిన “గాడ్ ఫాదర్” ని మళ్ళీ గుర్తు చేసారుగా..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలే రెండు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో “ఆచార్య” చిత్రం భారీ ప్లాప్ కాగా నెక్స్ట్ వచ్చిన “గాడ్ ఫాదర్” మాత్రం కాస్త మెగా ఫ్యాన్స్ ని ఉత్సహపరిచింది. ఇక ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా అయితే రిలీజ్ కాగా దాదాపు సినిమా జరుపుకున్న బిజినెస్ ని రాబట్టుకుంది.

మరి దీనితో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి ఎదురు చూస్తున్న వారికి గత కొన్ని వారాల కితమే ఈ సినిమా హక్కులు తీసుకున్న సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ నవంబర్ 19 నుంచి అయితే తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇది చాలా రోజులు అయ్యిపోయింది నిజానికి చాలా మంది మర్చిపోయి కూడా ఉండొచ్చు.

కానీ లేటెస్ట్ అయితే గాడ్ ఫాదర్ ఓటిటి టీజర్ ని వారు రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. దీనితో ఈ అలర్ట్ తో మర్చిపోయిన గాడ్ ఫాదర్ ఓటిటి రిలీజ్ ఒక్కసారిగా అందరికీ గుర్తొచ్చింది. ఇక ఇక్కడ నుంచి గాడ్ ఫాదర్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా ఈ సినిమాని అయితే మోహన రాజా దర్శకత్వం వహించగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. అలాగే థమన్ సంగీతం ఇవ్వగా నయనతార, నటుడు సత్యదేవ్ లు ఓ ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించారు.