ఆచార్య పోయినా గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరు… మరి కొరటాల?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన కొరటాల శివ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా అనూహ్యంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల ఇటు చిరంజీవి అటు కొరటాల శివ కూడా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఈ సినిమా డిజాస్టర్ కి కొరటాల శివ కారణమంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా ఆచార్య తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని భావిస్తున్నాడు. దీంతో కొరటాల శివ ముందు అనుకున్నట్లుగా కాకుండా ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టు కథ మార్చే పనిలో పడ్డాడు. చాలా కాలంగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ అభిమానుల్ని వెయిట్ చేయిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో నందమూరి అభిమానులు కొరటాల పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు.

ఇక ఆచర్య తో ఫ్లాఫ్ అందుకున్న మెగాస్టార్.. గాడ్ ఫాదర్ సినిమా తో మంచి హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో తీసే సినిమాతో కొరటాల కూడా హిట్ అందుకుంటాడో ? లేదో? చూడాలి మరి. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్లో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా నవంబర్ రెండవ వారంలో ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.