డైరెక్టర్ బాబీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన చిరు… గిఫ్ట్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Chiranjeevi

కొత్త ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇలా కొత్త సంవత్సరంలో అద్భుతమైన విజయాన్ని అందించడంతో చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాబి ఇలా చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించడంతో మెగా ఫాన్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సంతోషాన్ని డైరెక్టర్ బాబితో కలిసి చిరు సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త ఏడాదిలో తనకు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందించిన డైరెక్టర్ బాబిని చిరు తన ఇంటికి ఆహ్వానించి తనకు విందు భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా ఒక ఖరీదైన గిఫ్ట్ కూడా ఇచ్చారని సమాచారం.

ఇలా వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న చిరంజీవి ఎంతో సంతోషంతో డైరెక్టర్ బాబీకి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారని ఈ కారు విలువ సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి చిరంజీవి బాబికి కారు కానుకగా ఇచ్చారని వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.