Udayabanu: ఉదయభాను పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపిన నారా బ్రాహ్మణి… ఏంటో తెలుసా?

Udayabanu: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఉదయభాను ఒకరు . ఈమె సుమ కంటే కూడా ముందుగానే యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు ఎన్నో వేడుకలు ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు ఉదయభాను సినిమాలలో కూడా నటించారు.

ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న ఉదయభాను ప్రస్తుతం మాత్రం ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు ఇలా ఈమెకు అవకాశాలు లేకపోవడమే కాకుండా తనకు ఇద్దరు కవల పిల్లలు జన్మించడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఉదయభాను ప్రస్తుతం తిరిగి ఫామ్ లోకి వస్తున్నారు. ప్రస్తుతం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్న ఉదయభాను ఇటీవల భువనేశ్వరి తన సోదరుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఒక పార్టీ అరేంజ్ చేశారు.

ఇక ఈ పార్టీలో ఉదయభాను యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య ఫ్యామిలీని ఉదయభాను ఎంతో అమితంగా ఇష్టపడటమే కాకుండా గౌరవిస్తూ ఉంటారు ఎన్నో సందర్భాలలో బాలకృష్ణ గారి గొప్పతనం గురించి కూడా ఈమె మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణ ఉదయభాను ఇద్దరి కవల పిల్లల కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఈ విషయాన్ని ఉదయభాను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.

నారా బ్రాహ్మణి తన పిల్లలకు ఎంతో ఇష్టమైన వయోలిన్ కానుకగా పంపించినట్లు ఈమె తెలియజేశారు. ఇలా తమ కోసం వయోలిన్ గిఫ్ట్ గా పంపించారని విషయం తెలిసిన పిల్లలు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా పిల్లలిద్దరూ థ్యాంక్యూ బాలయ్య మామ అని చెప్పారు. అలాగే ఉదయభాను కూడా బాలకృష్ణ, నారా బ్రాహ్మణికి థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.