స్నేహితులు, బంధువులు, ప్రియమైన వారికి.. ఎవరికైనా పుట్టినరోజు, పెళ్లి, ఇతర వేడుకల్లో బహుమతులు ఇచ్చుకోవడం చాలా సాధారణం. కాని వాస్తు, జ్యోతిష్యం చెప్పే ప్రకారం కొన్ని బహుమతులు ఇవ్వడం అస్సలు మంచిది కాదు.. ఇవి ఇరువురి బంధాన్ని చెడగొట్టే ప్రమాదం కూడా ఉంటుందట. ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం.
మొదటగా పాదరక్షలు: చెప్పులు, బూట్లు. కొంతమంది దగ్గరి స్నేహితులు stylish గా ఉండాలని ఫ్యాన్సీ చెప్పులు గిఫ్ట్ ఇస్తారు. కానీ జ్యోతిష్యం ప్రకారం ఇలా చేయడం మంచిది కాదు. పాదరక్షలు భూమి నితరంతరం తగులుతూ ఉంటాయి. ఇవి బంధం దూరం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఎంత దగ్గరి వాళ్లైనా చెప్పులు గిఫ్ట్ చేయడం మానేయడం మంచిది.
నల్లటి వస్త్రాలు: నల్లరంగు ప్రతికూలతను సూచిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ రంగు దుస్తులు పండగల సమయంలో, శుభకార్యంలో గిఫ్ట్‌గా ఇవ్వడం వల్ల దూరాలు పెరుగుతాయట. సానుకూల శక్తి కంటే ప్రతికూలత ఎక్కువగా ఉంటుందని నమ్మకం. అందుకే బర్త్‌డేలు, పెళ్లిళ్లలో నల్ల దుస్తులు కాకుండా రంగులు ఇచ్చే ప్రయత్నం చేయాలి.
మహాభారతం లేదా ఇతిహాస గ్రంథాలు: కొందరు భక్తితో ఇతిహాస గ్రంథాలు తమ ప్రియమైన వారికి బహుమతిగా ఇస్తుంటారు. కాని మహాభారతాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడం వలన సమస్యలు వస్తాయని పెద్దలు అంటుంటారు. ఇది గొడవలు, విభేదాలు పెంచే అవకాశం ఉన్నదట. అందుకే ఈ గ్రంథాన్ని ఎవరికైనా గిఫ్ట్ చేయకుండా ఉండటం మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
దేవతల విగ్రహాలు: చాలా మంది ఫోటో ఫ్రేమ్‌లు కూడా మనం తరచూ గిఫ్ట్‌గా ఇస్తుంటాం. కానీ ఇది కూడా శుభం కాదంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ విగ్రహాలను శ్రద్ధగా చూసుకుంటారని చెప్పలేం. పూజించకుండా, ధూళి పట్టినట్లు మూలలో ఉంచడం వల్ల దైవత్వానికి అవమానం జరుగుతుందట. దాంతో ఆ శక్తి ప్రతికూలం అవుతుందని నమ్మకం. కాబట్టి దేవతల విగ్రహాలు, ఫోటోలు బహుమతిగా ఇవ్వకూడదు.
కాబట్టి కాబట్టి దగ్గరి బంధం సుస్థిరంగా కొనసాగాలని, సానుకూల శక్తి ఉండాలని చూస్తే.. వాస్తు, జ్యోతిష్యం చెబుతున్న ఈ చిట్కాలను గుర్తుంచుకోండి. బహుమతులు ఇస్తూ బంధాన్ని గాడిలో పెట్టండి కాని, పాదరక్షలు, నల్లటి దుస్తులు, మహాభారతం, దేవతల విగ్రహాలు మాత్రం బహుమతుల జాబితా నుంచి తొలగించండి.
