Mission Impossible: చిన్న సినిమా కోసం మెగా ప్రమోషన్..!

Mission Impossible: తాప్సీ పన్ను ఒక విలక్షణమైన కథాంశంతో కూడిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెలబ్రిటీలు ఈ సినిమా గురించి ప్రమోషన్లు ఇవ్వడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ సినిమా ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం మార్చి 30వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకకు సన్నాహాలు జరుపుతోంది.

ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను జోడించడానికి జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ సినిమాకు నవీన్ పొలిశెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. విడుదలకు ముందే ట్రైలర్ టీజర్ తో ఈ చిత్రం అద్భుతమైన స్పందన అందుకుంది. చిన్న సినిమాగా వస్తున్న అభిమానుల్లో హైప్ మాత్రం బాగా క్రియేట్ చేసింది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు దర్శకత్వం వహించిన స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.