“పుష్ప 2” కి ఛీప్ పబ్లిసిటీ.?

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర సెన్సేషనల్ హైప్ ఉన్నటువంటి చిత్రాల్లో పుష్ప 2 ది రూల్ కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ అయితే తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ భారీ సినిమాని మాసివ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతున్నట్టుగా టాక్ ఉంది.

అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొన్ని ఊహించని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ చిత్రం విషయంలో అల్లు అర్జున్ తన పి ఆర్ టీం తో కొన్ని ఛీప్ ట్రిక్స్ కూడా ప్లే చేస్తున్నాడని ఎప్పుడు నుంచో ఓ టాక్ కూడా ఉంది.

కాగా ఇపుడు ఇదే టీం తో ఈ సినిమా ఆడియో సహా హిందీ సాటిలైట్ హక్కులు రికార్డు ధరకి అమ్ముడుపోయాయి అని కొన్ని రూమర్స్ పెద్ద ఎత్తున అంటే మామూలుగా కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు. అయితే ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు తెలుస్తుంది. ఇదంతా కేవలం అటెన్షన్ కోసం చేస్తున్న ట్రిక్స్ మాత్రమే అని కొందరు ఫిల్మ్ ట్రాకర్స్ అంటున్నారు.

దీనితో మరికొందరు అయితే బన్నీ కి ఎందుకు ఇంత పబ్లిసిటీ పిచ్చి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.