చై 22 : క్రేజీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేశాయ్.!

Naga Chaitanya

అక్కినేని వారి ఇంటి నుంచి వచ్చిన యువ హీరోస్ లో నటన పరంగా ఆకట్టుకునే హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకడు. మరి ఇప్పుడు అయితే తన సినిమా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా మళ్ళీ అయితే మంచి హిట్ కోసం తాను ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా వచ్చిన “థాంక్ యూ” సినిమా అంతగా రాణించకపోయినా..

నెక్స్ట్ మాత్రం తమిళ హిట్ దర్శకుడు వెంకట్ ప్రభు తో తన కెరీర్ 22వ సినిమాని అయితే తాను ప్లాన్ చేసాడు. ఇక ఈరోజు చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మరి మొదటి నుంచి ఈ సినిమాలో చైతన్య పోలీస్ గా కనిపిస్తాడని చెప్పారు.

ఇపుడు అందుకు తగ్గట్టే పోలీస్ గెటప్ లో ఉన్న చైతన్య ని పరిచయం చేసి రిలీజ్ చేసిన పోస్టర్ తో సినిమాకి “కస్టడీ” అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు. అలాగే దీన్ని గమనిస్తే తానూ పోలీస్ అయినప్పటికీ ఇతర పోలీస్ లు అతన్ని కస్టడీ లోకి తీసుకున్నట్టు అనిపిస్తుంది.

దీనితో ఇందులో డీటెయిల్స్ మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఇంకా ఈ సినిమాలో మరోసారి చై సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాని బై లాంగువల్ గా తీస్తున్నారు.