Vijay Devarakonda : బాలీవుడ్ భామతో పార్టీ చేసుకున్న విజయ్ దేవరకొండ …వీడియో వైరల్ చేసిన ఛార్మి…!

 

Vijay Devarakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ అనన్య పాండే లైక్ ఏ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో రూపుదిద్దుకుంటున్న లైగర్ సినిమాని కరణ్ జోహార్ పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చార్మి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆగస్ట్ 25న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ హీరోయిన్ తో పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైరల్ చేసినది కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ చార్మి అవడం విశేషం. చార్మి విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో గురించి వివరాలు లోకి వెళితే…ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలో ‘లైగర్’ టీం మొత్తం పాల్గొంది.  ఆ పార్టీలోని వీడియోనే ఛార్మి విడుదల చేశారు.

ఈ వీడియోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే తమ అద్భుతమైన లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. విజయ్ విభిన్నమైన హెయిర్‌స్టైల్‌లో కన్పించగా, అనన్య బ్లాక్ కలర్ నెట్డ్ డ్రెస్‌లో అందంగా, హాట్ గా కన్పిస్తూ యువకుల హృదయాలను దోచుకుంది. చార్మి ఈ వీడియో ని పోస్ట్ చేస్తూ అద్భుతమైన లైగర్ జంట అంటూ కామెంట్ ను జత చేసింది.