అల్లు అర్జున్ కి చరణ్ గుణపాఠం చెప్పాడా.?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు ఇద్దరూ కూడా తమ సత్తా చాటుతున్నారు. అలాగే ఇద్దరూ కూడా ఒకరికి ఒకరంటే ఎంతో ప్రేమ కూడా ఉండేది.

ఇదంతా ఒకప్పుడు మాట కానీ ఇప్పుడు అయితే మెగా ట్యాగ్ నుంచి అల్లు అర్జున్ కాస్త దూరంగానే ఉంటున్నాడు అనేది ఉన్న మాటే. దానికి ఉదాహరణగా మొన్న రామ్ చరణ్ బర్త్ డే వస్తే అల్లు అర్జున్ కనీసం విష్ కూడా చేయలేదు. సరే ఇది పక్కన పెడితే నిన్న అల్లు అర్జున్ బర్త్ డే వచ్చింది.

దీనితో రామ్ చరణ్ విష్ చేస్తాడా చేయడా అని చూస్తుంటే రామ్ చరణ్ నిన్న సాయంత్రం ట్వీట్ చేసి షాకిచ్చాడు. అయితే ఈ విష్ కూడా నామమాత్రం గానే విష్ చేసి వదిలేసాడు. కాగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏమిటంటే ఇదే రోజున బర్త్ డే ఉన్న అఖిల్ అక్కినేని కి మాత్రం ఏకంగా ఫోటో కూడా కలిపి షేర్ చేసి మరింత ఆనందకరంగా తెలిపాడు.

దీనితో అల్లు అర్జున్ తనకి విషెస్ చెప్పకపోయినా కూడా రామ్ చరణ్ అల్లు అర్జున్ కి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపి తన గొప్పతనాన్ని చాటుకుంటే.. అఖిల్ కి చెప్పిన విషెస్ తో అయితే బన్నీ చేసిన పనికి నైస్ గా గుణపాఠం చెప్పాడు అంటూ అభిమానులు అనుకుంటున్నారు. దీనితో ఇపుడు ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.