అబ్బో చరణ్ సినిమా ఇంకా అంత బ్యాలన్స్ ఉందా.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇపుడు నటిస్తున్న మాసివ్ పాన్ ఇండియా సినిమా “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ వెటరన్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న ఈ సినిమా అనేక అంచనాలు అయితే నెలకొల్పుకుంది. మరి ఈ సినిమా షూటింగ్ ని ఇప్పుడు శంకర్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు.

ఓ పక్క ఇండియన్ 2 మరోపక్క ఈ సినిమాని అయితే తాను కంప్లీట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే గేమ్ చేంజర్ భారీ క్లైమాక్స్ కోసం అడుగు పెట్టిన శంకర్ ఈ పనుల్లో ఇప్పుడు బిజీగా ఉన్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాకి ఇంకా 60 రోజులకి పైగా షూటింగ్ బాకీ ఉందట.

ఇది మాత్రం షాకింగ్ అంశం అని చెప్పాలి. దాదాపు ఏడాది నుంచి షూటింగ్ చేస్తున్నారు. అయినా ఇంకా 60 రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉండడం అనేది చాలా ఎక్కువ అని చెప్పాలి. మరి ఈ షూటింగ్ అంతా ఎప్పటికి కంప్లీట్ అయ్యి రిలీజ్ కి వస్తుందో చూడాలి.

ప్రస్తుతానికి అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నామని దిల్ రాజు రివీల్ చేశారు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ హిట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.