గాసిప్స్ : చరణ్ హీరోయిన్ విషయంలో ఫ్యాన్స్ గుస్సా.?

ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్(RRR) సక్సెస్ తో ఐతే చరణ్ స్టార్డం మారిపోయింది. మరి ఇది ఎంతవరకు ఉంటుందో ఏమో కానీ ప్రస్తుతం అయితే రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో భారీ సినిమా చేస్తున్నాడు. పైగా హీరోయిన్ కియారా అద్వానీ ఇందులో నటిస్తుంది.

అయితే ఈ ఇద్దతి జంటకి ముందు మంచి హిట్ లేకపోయినా ఈ జంట అయితే హిట్ అయ్యింది చాలా మంది ఇష్టపడే వారు ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ తో చేసే హీరోయిన్ విషయంలోనే ఫ్యాన్స్ అప్పుడే ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు సాన “ఉప్పెన” ఫేమ్ దర్శకునితో ఓ సినిమా కమిట్ అయ్యాడు..

ఇది ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే స్టార్ట్ కానుంది. అయితే ఇంకా ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనేది అధికారికంగా కన్ఫర్మ్ కాలేడీ కానీ ప్రస్తుతం అయితే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు పరిశీలనలో ఉంది అంటూ ఓ టాక్ ఇపుడు బయటకి వచ్చింది. కానీ దీనితో అయితే చరణ్ ఫ్యాన్స్ అంత ఎగ్జైటెడ్ గా లేరు.

ఆ హీరోయిన్ వద్దు అని కూడా కొందరు అనేస్తున్నారు. పైగా ఈ హీరోయిన్ మొదట ఎన్టీఆర్ తో నటిస్తుంది కాబట్టి చరణ్ చేస్తే ఎన్టీఆర్ ని అతను ఫాలో అయినట్టు ఉంటుంది అని అనుకునే వారు కూడా లేకపోలేరు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి హీరోయిన్ ఎవరూ ఇంకా ఫిక్స్ కాలేదు సో ఫ్యాన్స్ టెన్షన్ పడక్కర్లేదు.