ఓటిటి : “చంద్రముఖి 2” ఎప్పుడు ఎందులో అంటే..!

ఈ ఏడాది తమిళ సినిమా నుంచి వచ్చిన పలు నోటెడ్ చిత్రాల్లో అయితే హీరో రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా దర్శకుడు వాసు తెరకెక్కించిన చిత్రం “చంద్రముఖి 2” కూడా ఒకటి. మరి తెలుగు స్టేట్స్ లో కూడా మంచి ఆక్యుపెన్సీతో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి రోజే డిజాస్టర్ అయ్యింది.

దీనితో తెలుగు సహా తమిళ్ లో కూడా పెద్దగా రాణించని ఈ చిత్రం చంద్రముఖి అనే సినిమాకి ఉన్న బ్రాండ్ పవర్ ని అందుకోలేకపోయింది. దీనితో “చంద్రముఖి 2” భారీ డిజాస్టర్ గా మిగిలిపోగా ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

కాగా ఈ సినిమాకి డిజిటల్ డేట్ గా ఈ అక్టోబర్ 26 కి ఫిక్స్ అని తెలుస్తుంది. కాగా ఈ చిత్రం హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ చెంతన ఉండగా అందులో ఆరోజు నుంచి ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం.

దీనితో అయితే ఒకవేళ అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి చూడాలి అనుకునేవారికి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత కీరవాణి సంగీతం అందించినప్పటికీ ఈ సినిమాకి ఏమంత గొప్ప హైప్ రాలేదు అలాగే తమిళ ఆడియెన్స్ కూడా అంత కనెక్ట్ కాకపోవడం కూడా ఈ సినిమా విఫలానికి ఓ కారణం అని చెప్పాలి.