Catherine Theresa : మళ్ళీ తెలుగులో బిజీ అవుతున్న కాథెరిన్… మాస్ రాజా తో రొమాన్స్…!

Catherine Theresa: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రవితేజ ప్రస్తుతం హీరోగానే కాకుండా చిరంజీవి బాబి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి పార్టీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అన్న టైటిల్ కూడా ఖరారు అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో శృతి హాసన్ చిరంజీవి సరసన నటిస్తోంది.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా,మైత్రి మూవీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ పాత్ర కూడా ఒక హీరోయిన్ ఉందట. హీరోయిన్ పాత్ర కోసం కేథరిన్ సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలే నిజమైతే కేథరిన్ చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో వస్తున్నా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టే.

కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం కేథరిన్ సినిమాకు మొదటి ఆప్షన్ కాదట. అయితే వేరే హీరోయిన్ ఎవరు సెట్ అవ్వకపోతే కేథరిన్ ఏ అవకాశం ఇవ్వనున్నట్టు బృందం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం శేఖర్ ఇన్ ‘మాచర్ల నియోజకవర్గం’, ‘బింబిసార’, ‘బాల తందాన’ వంటి సినిమాల్లో నటిస్తోంది. మొత్తానికి కేతరిన్ మళ్లీ తెలుగు సినిమాల్లో బిజీగా కనిపిస్తోంది.