Allu Arjun: తమ్ముడి కోసం అన్న విశ్వ ప్రయత్నాలు… బాలీవుడ్ బడా వ్యక్తులతో అందుకేనా చర్చలు….!

Allu Arjun: అల్లు వారసులుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు అల్లు అర్జున్ ఇంకా అల్లు శిరీష్. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు పుష్ప సినిమాతో ఇండియా లెవెల్ లో ఐకానిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అల్లు శిరీష్ మాత్రం అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగిన అల్లు శిరీష్ మినిమం హీరోగా కూడా ఎదగలేక పోయాడుమెగా ముద్రతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి వచ్చి మంచి మంచి సినిమాలు చేసిన అల్లు శిరీష్ ఎందుకో హీరోగా కూడా సక్సెస్ అవ్వలేక పోయాడు.

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం మరొక స్టార్ హీరో కదిలి రావడం, ఒకరి సినిమాల కోసం ఒకరు సహాయం చేసుకోవడం మనం చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం.అదే సమయంలో ఒక సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలు ఇతర సినిమా పరిశ్రమ లోకి వెళ్లి అక్కడ రాణిస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ కెరీర్ ను బాలీవుడ్లో సెట్ చేసేందుకు గాను అల్లుఅర్జున్ కొంతమంది తో చర్చలు జరుపుతున్నారట.

కేవలం హీరోగానే కాకుండా అతనికి ముఖ్యమైన సినిమాలలో ఇతర పాత్రలతో మంచి హైప్ వచ్చేలా చేయాలని ఆలోచిస్తున్నారట. అల్లు అరవింద్ కూడా అల్లు శిరీష్ కోసం బాలీవుడ్ అగ్ర నిర్మాత తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి అన్న అండతో అల్లు శిరీష్ కు బాలీవుడ్ లో ఏమైనా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.