రామ్ చరణ్ సినిమాపై బిగ్ అప్డేట్స్ ఇచ్చిన బుచ్చిబాబు 

ram-charan-collaborates-with-Buchi-Babu-Sana-confirms-news-1280x720

ఇప్పుడు టాలీవుడ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎలాంటి క్రేజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాము. అలా ఇపుడు మన టాలీవుడ్ హీరోలు కూడా కథల ఎంపికలో చాలా పర్టిక్యులర్ గా ఉంటూ భారీ చిత్రాలు చేస్తున్నారు. మరి అలా లైనప్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ పోస్ట్ RRR సక్సెస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు.

కాగా ఈ లిస్ట్ లో అయితే ఇప్పుడు శంకర్ తో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “గేమ్ చేంజర్” చేస్తుండగా ఈ సినిమా అనంతరం అయితే దర్శకుడు బుచ్చిబాబు తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా బుచ్చిబాబు చేస్తున్న కామెంట్స్ కానీ తనకి ఉన్న కాన్ఫిడెన్స్ కానీ చూస్తుంటే ముచ్చట వేస్తుంది.

కాగా బుచ్చిబాబు మాట్లాడుతు ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా కన్నా అంతకు మించి ఉంటుంది చాలా రా అండ్ రస్టిక్ ఈ చిత్రం ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు అలాగే ఈ చిత్రానికి మరో బిగ్ హైలైట్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తునట్టుగా గత కొన్నాళ్లగా ఉన్న రూమర్స్ పై కూడా తాను బిగ్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ చిత్రానికి కథ సిద్ధం చేస్తున్నపుడే నాకు ఎందుకో రెహ్మాన్ గారు అయితే బాగుంటుంది అని అనిపించింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారితో కూడా బాగుంటుంది అలాగే రెహ్మాన్ సంగీతం కూడా నాకు బాగా ఇష్టం. అయన పాటలు గాని మ్యూజిక్ గాని ఎంతో ఇష్టం. ఇలా ఈ సినిమా కథ ఆయనికి చెప్పగానే ఇమీడియేట్ గా ఓకే చేసేసారు అని తప్పకుండ ఈ చిత్రానికి నేను వర్క్ చేస్తాను అని చెప్పారని తెలిపాడు. దీనితో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ విషయంలో బుచ్చిబాబు మాత్రం అదిరే అప్డేట్స్ ని అందించడం వైరల్ గా మారింది.