ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బ్రహ్మాస్త్ర… ఎక్కడంటే?

బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో కూడా ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనటువంటి ఈ సినిమాని నవంబర్ మూడవ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

బ్రహ్మాస్త్ర సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో సుమారు 600 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇలా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ తొమ్మిదవ థియేటర్లో విడుదలైన ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గురువారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని మరోసారి వీక్షించాలని ఎదురుచూసే అభిమానులకు ఇప్పటివరకు ఈ సినిమా చూడని ప్రేక్షకులకు కూడా ప్రస్తుతం ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పార్ట్-2 చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.