RRR రైటర్.. న్యూ సెన్సెషన్!

బాహుబలి, ఆర్ఆర్ఆర్, బజరంగీ భాయ్ జాన్, మణికర్ణిక సినిమాల ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి నెక్స్ట్ మూవీ కోసం కథని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబందించిన వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ నవలని మరో రచయితతో కలిసి రాసారు.

బ్రహపుత్ర ది అహోం సన్ రైజ్ అనే టైటిల్ తో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. వాల్యూమ్ 1 గా ఈ నవలని రిలీజ్ చేశారు. ఈ పుస్తకాన్ని హార్పర్ కోలిన్స్ పబ్లిషర్స్ మే 30 న పబ్లిష్ చేశారు. రిటైర్డ్ నేవీ ఆఫీసర్, ఇండియన్ ఆర్మీలో 20 ఏళ్ళు పని చేసిన కుల్ ప్రీత్ యాదవ్ తో కలిసి విజయేంద్ర ప్రసాద్ ఈ పుస్తాకాన్ని రాయడం విశేషం. 17వ శతాబ్దానికి చెందిన లోచిత్ బర్పకున్ కథగా దీనిని ఆవిష్కరించారు.

ఇక కథలోకి వెళ్తే లోచిత్ అహోమ్ సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తి స్వర్గాదియో జయధ్వజ్ సింగ్ కుమార్తె పద్మినితో ప్రేమలో పడతాడు. అయితే వారి ప్రేమ గురించి తెలిసిన మహారాజు లోచిత్ ని రాజ్య బహిస్కరణ చేస్తారు. ఆ తరువాత మొగల్ చక్రవర్తి ఔరంగజేబు అహోం రాజ్యంపై దండయాత్ర చేస్తాడు. ఆ సమయంలో అహోం రాజ్యంలోకి కొంత భాగం వారికి ఇచ్చి జయధ్వజ్ శాంతి ఒప్పందం చేసుకుంటారు.

అయితే జయధ్వజ్ కుమారుడు చక్రధ్వజ్, లోచిత్ కలిసి ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సామంత రాజులతో కలిసి ఔరంగజేబుపై యుద్ధానికి వెళ్తారు. ప్రిన్స్ పద్మిని కూడా ఈ యుద్ధంలో వారితో కలుస్తుంది. వారు ముగ్గురు కలిసి అహోం రాజ్యాన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు నుంచి కాపాడుకొని బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

అయితే దీంట్లో మొగల్ సైన్యంపై వారు గెలిచారా, అహోం రాజ్యాన్ని సమస్యల నుంచి బయట పదేసారా అనే ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో కథనం ఉంటుంది. మొత్తానికి రీసెంట్ గా వచ్చిన ఈ నవల ఇప్పుడు సెన్సేషన్ అవ్వడానికి రెడీ అయ్యింది. మరి ఏ స్థాయిలో ఈ బ్రహ్మపుత్ర నవల రీడర్స్ ని ఎంగేజ్ చేస్తుంది అనేది వేచి చూడాలి.