Gallery

Home News బిబి3 లో బాలయ్య హీరోయిన్ అదిరిపోయింది.. ఇప్పుడు టాలీవుడ్ కావాల్సింది ఇలాంటి అమ్మాయే..!

బిబి3 లో బాలయ్య హీరోయిన్ అదిరిపోయింది.. ఇప్పుడు టాలీవుడ్ కావాల్సింది ఇలాంటి అమ్మాయే..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ తిరిగి మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ సినిమా కాగా… ఈ కాంబినేషన్ లో ఇంతక ముందు వచ్చిన ‘సింహ, లెజెండ్’ భారీ కమర్షియల్ సక్సస్ లను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు తెరకెక్కుతున్న బిబి3 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బిబి3 ఫస్ట్ రోర్ తో సెన్షేషన్ ని క్రియోట్ చేశారు.

బాలయ్య కోసం మలయాళీ భామ - Mirchi9.Com

అయితే గత కొన్నాళ్లు ఈ సినిమాలో బాలయ్య కి జంటగా నటించే హీరోయిన్స్ ఎవరన్నది క్లారిటి రాలేదు. కీర్తి సురేష్ తో మొదలైన ప్రచారం.. నయనతార, సోనాల్ చౌహాన్, అమలా పాల్, అంజలి, స్నేహ…ఇలా చాలా పేర్లు వార్తల్లో నిలిచాయి. కాని బోయపాటి మాత్రం బాలయ్య కి జంటగా ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నట్టు ఇంతక ముందే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఒక మలయాళ బ్యూటీ ని అనుకుంటున్నట్టు.. తననే బాలయ్య కి జంటగా తీసుకోబోతున్నట్టు సమాచారం.

Malayali Beauty Confirmed For Balayya'S Next

బిబి3 లో బాలయ్య కి జంటగా మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ ను కన్ఫర్మ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రగ్యా మార్టిన్ మలయాళం తో పాటు తమిళంలో కూడ నటించింది. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘పిశాసు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి ప్రగ్యా మార్టిన్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా అవార్డ్ కూడ అందుకుంది. కాగా ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకి కావాల్సింది ఇలాంటి హీరోయిన్ అని చెప్పుకుంటున్నారు. అయితే ప్రగ్యా మార్టిన్ నిజంగా బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలకి మంచి పేయిర్ లా కనిపిస్తుంది. చూడాలి మరి బోయపాటి.. ప్రగ్యా మార్టిన్ నే బాలయ్య కోసం తీసుకు వస్తున్నాడా లేదా ..!

- Advertisement -

Related Posts

కోవిడ్ వసూళ్ళు: ప్రభుత్వాల ఆదాయం అదుర్స్.. సామాన్యుడి బెదుర్స్

అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. అస్సలేమాత్రం తగ్గట్లేదు. కరోనా నేపథ్యంలో జనం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంటే, ప్రభుత్వాలు మాత్రం, ఏదో రకంగా సామాన్యుడి నడ్డి విరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి...

ఏపీ కరోనా అప్డేట్… ఆ రెండు జిల్లాలలో స్వల్పంగా పెరిగిన కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 85,856 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,287 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది....

పెండింగ్ ప్రాజెక్టులపై ఏపీ బీజేపీకి కొత్త ప్రేమ.!

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీకి వున్న అవగాహన ఏంటి.? ఆ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి వున్నారు.? ఈ విషయాలపై రాష్ట్ర ప్రజలకు ఖచ్చితమైన...

Latest News