టీజర్ టాక్ : పక్కా ఊరమాస్ గా బోయపాటి – రాపో థండర్.!

మాస్ అండ్ స్టైలిష్ హీరో కలిస్తే ఎలా ఉంటుందో లేటెస్ట్ గా ఉస్తాద్ రామ్ పోతినేని మరియు దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న భారీ చిత్రం తెలిసిందే. మరి  చిత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఈరోజు రామ్ పోతినేని బర్త్ డే కానుకగా అయితే సినిమా ఫస్ట్ థండర్ గా టీజర్ ని అయితే రిలీజ్ చేసారు.

మరి ఈ టీజర్ అయితే అంచనాలు రీచ్ అయ్యే లానే ఉందని  కాగా ఈ టీజర్ ని రెండు యాక్షన్ సీక్వెన్స్ లను మేకర్స్ చూపించారు. ఇక ఇందులో రామ్ మాస్ డైలాగ్స్ గాని విజిల్ కొట్టించే లెవెల్లో ఉన్నాయి. వీటితో పాటుగా రామ్ మేకోవర్ ని అయితే బోయపాటి కంప్లీట్ గా మార్చేశాడు.

ఇక ఈ టీజర్ లో ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరే లెవెల్లో కంపోజ్ చేయడం ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఉంది. మొత్తానికి అయితే ఈ టీజర్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ గా మంచి బహుమానాన్నే అందించారని చెప్పుకోవచ్చు. ఇక నిన్న అయితే రామ్ ఫ్యాన్స్ కి ఇస్మార్ట్ శంకర్ మేకర్స్ కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక బోయపాటి సినిమాలో అయితే టౌన్గ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుండగా ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా అయితే అక్టోబర్ లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. 
BoyapatiRAPO First Thunder | Ram Pothineni | Boyapati Sreenu | Sreeleela | Thaman S