మళ్ళీ చాలా కాలం తర్వాత మాస్ మహారాజ రవితేజ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుంది. ఆ సినిమానే “ధమాకా”. కాగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ లో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించగా యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమా సాలిడ్ వెల్కమ్ అందుకోగా మొదటి రోజు మాత్రం అదిరే వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలో రవితేజ నుంచి రెండు సినిమాలు ఖిలాడీ అలాగే రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ కాగా ఈ చిత్రాలని మించే ఈ సినిమా అదిరే ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ చిత్రం 10 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ తెలపగా తెలుగులో అయితే ఈ చిత్రం నాలుగున్నర కోట్లకి పైగా షేర్ ని రాబట్టగా 8 కోట్ల మేర గ్రాస్ ని ఒక తెలుగు స్టేట్స్ నుంచే ఈ చిత్రం రాబట్టినట్టుగా తెలుస్తుంది.
దీనితో ధమాకా తో మాత్రం రవితేజ మళ్ళీ తన బాక్సాఫీస్ కం బ్యాక్ ఇచ్చినట్టుగా చెప్పి తీరాలి. మరి ఈ ఏడాది ఆఖరికి మాత్రం మాస్ మహారాజ్ బ్లాస్టింగ్ ఎండింగ్ ఇచ్చాడని చెప్పొచ్చు. అలాగే ఈ టైం లో ఈ సినిమాకి ఉన్న టార్గెట్ ని కూడా ఈ చిత్రం రీచ్ అయ్యిపోయేలా కూడా ఉంది.