బాక్సాఫీస్ : డే 1 “రావణాసుర” గట్టి ఓపెనింగ్స్ వచ్చాయే.!

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రావణాసుర” తన గత రెండు భారీ హిట్స్ “ధమాకా” మరియు “వాల్తేరు వీరయ్య” లతో క్రేజీ ఓపెనింగ్స్ మరియు లాంగ్ రన్ వసూళ్లు అందుకున్న రవితేజ నెక్స్ట్ అయితే ఇదే హవా ని దర్శకుడు సుధీర్ వర్మ తో చేసిన “రావణాసుర” సినిమా కూడా అందుకుంటుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారు.

అయితే గత సినిమాలు మంచి ఎంటర్టైనర్స్ కాగా రవితేజ కి థ్రిల్లర్ సినిమాల్లో అంత బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ లేదు. అయినా కూడా రవితేజ ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా అయితే ధమాకా తో పోలిస్తే యూఎస్ లో కాస్త లో ఓపెనింగ్స్ నే అందుకున్నా కూడా రావణాసుర సినిమాకి గట్టి ఓపెనింగ్స్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు వచ్చాయి.

కాగా ఈ సినిమాకి అయితే టోటల్ గా వరల్డ్ వైడ్ 9 కోట్ల మేర గ్రాస్ వచ్చేసింది. అంతే కాకుండా 5 కోట్లకి దగ్గర షేర్ వచ్చింది. అలాగే నైజాంలో అయితే 1.65 కోట్లు షేర్ రాబట్టింది. అయితే ఇపుడు టాక్ కాస్త అటు ఇటుగా ఉంది మరి సినిమాకి ఉన్న 25 కోట్ల మేర టార్గెట్ రావాలి అంటే ఇంకా ఎక్కువ వసూలు చేయాల్సి ఉంది.

మరి ఫైనల్ గా అయితే రావణాసుర లెక్క ఎక్కడ ఆగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ అలాగే ఫరియా అబ్దుల్లా సహా దక్ష నగర్కార్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే సుశాంత్ కీలక పాత్రలో నటించాడు.