ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన చిత్రం “స్పై” కూడా ఒకటి. కాగా తన లాస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం కార్తికేయ 2 తెలుగు సహా హిందీలో మంచి హిట్ అయ్యింది.
అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం సక్సెస్ తో మళ్ళీ ఇండియా ఎమోషన్ తో సినిమా తీసి రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఈ ఫార్ములా అయితే అంత సక్సెస్ అయ్యినట్టు అనిపించలేదు కానీ సినిమాకి వరల్డ్ వైడ్ మాత్రం అదిరే వసూళ్లు వచ్చినట్టుగా నిఖిల్ కన్ఫర్మ్ చేసాడు.
ఈ చిత్రానికి నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు 11.7 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా తెలిపారు. మరి ఇంత కంగారు రిలీజ్ లో కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే ఆశ్చర్యకరం అని చెప్పాలి. కాగా ఈ చిత్రం అయితే పాన్ ఇండియా వైడ్ మరింత బెటర్ ఏమన్నా అవుతుందో లేదో చూడాలి.
ఇక ఈ చిత్రానికి దర్శకుడు గ్యారీ బి హెచ్ వర్క్ చేయగా యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటించగా రానా దగ్గుబాటి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర అయితే గెట్ రోల్ గా చేసాడు. అలాగే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ వారు అయితే ఈ స్పై అండ్ ఏక్షన్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.
#SPY is creating a storm at the box office ❤🔥
Nikhil has attained his career's biggest opening, grossing a staggering ₹11.70 Cr 💥💥#SpyMovie continues to dominate the box office, with housefull shows and additional screenings being added in various locations 🔥
Book Now… pic.twitter.com/D20AuyxpV5
— BA Raju's Team (@baraju_SuperHit) June 30, 2023