బాక్సాఫీస్ : “ధమాకా” 5 రోజుల వసూళ్లు ఎంతంటే.!

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ ఏడాది మూడో సినిమా “ధమాకా”. భారీ ప్రమోషన్స్ మధ్య ఎలా అయినా హిట్ అందుకోవాలని వచ్చిన ఈ చిత్రం మళ్ళీ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరే ట్రీట్ ని ఇచ్చింది.

రవితేజ కం బ్యాక్ లా నిలిచిన ఈ చిత్రం అయితే మాస్ మహారాజ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తూ ఉండగా వసూళ్లు కూడా చాలా స్టాండర్డ్ గా నమోదు అవుతూ వస్తున్నాయి. ఇక ఐదు రోజుల్లో అయితే ఈ చిత్రం మాసివ్ లెక్కలు నమోదు చేసింది.

మరి నాలుగు రోజుల్లో అయితే 42 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకోగా ఇప్పుడు 5వ రోజు వరల్డ్ వైడ్ ఈ చిత్రం 7 కోట్ల గ్రాస్ ని రాబట్టి 49 కోట్ల వసూళ్లు అందుకుని 5 రోజుల్లో 50 కోట్లకి జస్ట్ మిస్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రం అయితే మరింత స్ట్రాంగ్ గా నిలబడుతూ ఉండగా యూఎస్ లో అయితే మరిన్ని ప్రాంతాల్లో ఎక్కువ షోలు సహా మరిన్ని థియేటర్స్ కేటాయించుకుంటుంది అని తెలుస్తుంది.

అలాగే కంటిన్యూస్ గా తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం 5 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేస్తూ వచ్చింది. దీనితో మాత్రం ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటించగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు.