టాలీవుడ్ మాస్ హీరో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ధమాకా”. ఈ ఒక్క ఏడాదిలోనే తనకిది మూడో రిలీజ్ కాగా ఈ సినిమా రిలీజ్ తో మాత్రం హ్యాట్రిక్ ప్లాప్ ల నుంచి రవితేజ తప్పించుకున్నారని చెప్పాలి. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన తీసిన ఈ సినిమా కూడా మళ్ళీ హిట్ గా నిలిచి తన ట్రాక్ లో ప్లాప్ లేకుండా దూసుకెళ్తుంది.
ఇక ఈ సినిమా అయితే మొదటి రోజే బ్యాంగింగ్ ఓపెనింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా అందుకోగా రెండో రోజు కూడా చాలా నిలకడ వసూళ్లు ధమాకా కి నమోదు కావడం ట్రేడ్ వర్గాలలో టాపిక్ గా మారింది. మరి రెండో రోజు అయితే జస్ట్ ఒక్క కోటి డ్రాప్ మాత్రం ఈ సినిమాకి నమోదు అయ్యింది.
దీనితో రవితేజకి హిట్ పడితే ఎలా ఉంటుందో క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాతో అయితే ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. అయితే రెండో రోజు ధమాకా కి 9 కోట్ల గ్రాస్ రాగా రెండు రోజుల్లో అయితే 19 కోట్లు గ్రాస్ ని ఈ సినిమా అందుకుంది.
ఇక తెలుగు స్టేట్స్ లో అయితే ఈ చిత్రం రెండో రోజు మూడున్నర కోట్లకి పైగానే షేర్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనితో రవితేజ స్టార్ పవర్ ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే తన గత సినిమాల్లో రెండో రోజు వసూళ్లు హిట్ అయ్యిన వాటికి ఒకలా కానీ వాటికి ఒకలా ఉన్నాయి. దీనితో ధమాకా ఓ సాలిడ్ హిట్ గా మారింది.