బాక్సాఫీస్ : డే 1 అదిరే వసూళ్లతో “దాస్ కా ధమ్కీ”.!

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ హీరోస్ లో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకరు. మరి విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “దాస్ కా ధమ్కీ”. తానే స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అయితే నిన్న ఉగాది కానుకగా రిలీజ్ అయ్యింది.

కాగా ఈ సినిమా కి చాలా మిక్సిడ్ స్పందనే వచ్చింది కానీ మాస్ ఆడియెన్స్ ఈ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. నిన్న రెండో ఆట నుంచే భారీ ఎత్తున జంప్ బుకింగ్స్ లో గాని షోస్ లో గాని పించగా ఈ సినిమా అయితే మాస్ ఆడియెన్స్ దెబ్బతో ముఖ్యంగా యూత్ తో అయితే ఈ సినిమాకి మొదటి రోజు మంచి వసూళ్లే దక్కాయని చెప్పాలి.

డే 1 ధమ్కీ కి వరల్డ్ వైడ్ గా 8.8 కోట్ల గ్రాస్ ని అందుకుందట. దీనితో విశ్వక్ కెరీర్లోనే మరో సాలిడ్ ఓపెనర్ గా అయితే ఈ సినిమా నిలవగా ఆల్ టైం హైయెస్ట్ ఓపెనర్ గా కూడా ఇది నిలిచింది. పండుగ నాడు బాగా ప్లస్ కాగా ఎలాగో మాస్ పల్స్ అందుకుంది కాబట్టి ఈ వారాంతానికి మరింత మంచి వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాలో నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. అలాగే విశ్వక్ సేన్ మరియు కరాటే రాజు లు అయ్యితే ఈ సినిమాని సంయుక్తంగా నిర్మాణం వహించారు.