ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏడాది మొత్తంలో 10 హిట్స్ రావడం అంటే గగనం అయిపోయేది. మెజారిటీ చిత్రాలు ఏవరేజ్, ఎబౌవ్ ఏవరేజ్ దగ్గరే ఆగిపోతూ ఉండేవి. నిర్మాతలకి భారీ లాభాలు తీసుకొచ్చే సినిమాలు అంటే వేళ్ళ మీద లెక్కపెట్టే స్థాయిలో ఉండేవి. దీనికి కారణం హీరోలు అందరూ కూడా కమర్షియల్ జోనర్ లో రొటీన్ ఫార్ములా కథలతో సినిమాలు చేయడమే. టాలీవుడ్ చిత్రాలపై కూడా అలాంటి టాక్ అన్నిచోట్ల ఉండేది. ఇక్క స్టార్ హీరోయిన్స్ అయిన వారు కూడా తెలుగు చిత్రపరిశ్రమ గురించి తక్కువగానే మాట్లాడేవారు.
తెలుగులో టాలెంట్ చూపంచుకునే కథలు రావు. ఎంత సేపు హీరోల చుట్టూ తిరిగి రొటీన్ మూస ఫార్ములానే ఫాలో అవుతారని విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. మన హీరోల ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయి. కథలో దమ్ము ఉంటే హీరోయిజం దానికదే ఎలివేట్ అవుతుందని నమ్మడం మొదలు పెట్టారు. దర్శకులకి కొత్త కథలు తయారు చేసే ఛాయస్ ఇచ్చారు. రొటీన్ ఫార్ములాని పూర్తిగా పక్కన పెట్టారు.
ఒక వేళ చేయాల్సి వస్తే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో హిట్స్ రేషియో ఇప్పుడు టాలీవుడ్ లో పెరిగింది. 2023 మొదటి అర్ధంభాగం పూర్తి కాకుండానే టాలీవుడ్ లో ఏకంగా 10 హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో 9 సినిమాలు అయితే నిర్మాతలు భారీ లాభాలు ఆర్జించాయని చెప్పాలి. వాటి వివరాలు చూసుకుంటే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య సంక్రాతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
నిర్మాతకి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. రొటీన్ స్టోరీ లైన్ ఆయిన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ కాకుండా కథనం నడిపించడం మూవీ హిట్ అయ్యింది. ఇక సంక్రాతి కానుకగా బాలయ్య వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజునిర్మాణంలో వచ్చిన వారసుడు మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుహాస్ హీరోగా వచ్చిన చిన్న సినిమా రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ లాభాలు తీసుకొచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా గీతా ఆర్ట్స్ 2లో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ హిట్ అయ్యింది. కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దిల్ రాజుకి భారీ లాభాలు అందించింది.
విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన దాస్ కాధమ్కీ మూవీ సూపర్ హిట్ అయ్యింది. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఏప్రిల్ ఆఖరు వరకు టాలీవుడ్ లో పది సినిమాలు కలెక్షన్స్ పరంగా నిర్మాతలకి మంచి లాభాలు తీసుకురావడం విశేషం.