రీసెంట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన టాలీవుడ్ మిడ్ రేంజ్ బడ్జెట్ చిత్రాల్లో నాని నటించిన “దసరా” కూడా ఒకటి. మరి ఇదే కోవలో అయితే పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మరో సినిమా “ఏజెంట్”.
అఖిల్ అక్కినేని హీరోగా సాక్షి వైద్య అనే కొత్త హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి హాలీవుడ్ లెవెల్లో అయితే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇపుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి దగ్గరకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.
అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రస్టింగ్ గాసిప్ సినిమాపై తెలుస్తుంది. ఈ సినిమాలో మేకర్స్ అయితే ఓ అదిరే ఐటెం సాంగ్ ని ప్లాన్ చేశారట. కాగా ఈ సాంగ్ లో అయితే లేటెస్ట్ బాస్ బ్యూటీ వాల్తేరు వీరయ్య ఫేమ్ ఊర్వశి రౌటేలా కనిపించనున్నట్టుగా తెలుస్తుంది.
దీనితో అయితే అఖిల్ మరియు ఊర్వశి లు తమ డాన్స్ మరియు గ్లామర్ షో తో అదరగొట్టనున్నారని చెప్పాలి. ఇంకా ఈ సినిమాకి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం గ్రాండ్ గా ఈ ఏప్రిల్ 28న అయితే విడుదల కాబోతుంది.
