పెద్ద హిట్టు కొట్టినా.. ఆ తర్వాత అవకాశాలు వుండవు కొందరికి. ఫ్లాపొచ్చినా, అనూహ్యంగా కెరీర్ వెలిగిపోతుంటుంది ఇంకొందరికి. హీరోయిన్లకి ఈ విషయంలో కొంత అడ్వాంటేజ్ వుంటుంది హీరోలతో పోల్చితే.
సాక్షి వైద్య గురించే ఇప్పుడిదంతా. ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాక్షి వైద్య. తొలి సినిమా డిజాస్టర్. రెండో సినిమా ‘గాండీవ ధారి అర్జున’ కూడా అంతే. రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ తేడా కొట్టేసినా, ఇప్పుడామె చేతిలో మంచి ప్రాజెక్టులే వున్నాయ్.
తాజాగా, విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్.. అనే ప్రచారం జరుగుతోంది. శ్రీలీల, రష్మిక మండన్న డేట్స్ కుదరకపోవడంతో, సాక్షి వైద్యకు లక్కు కలిసొచ్చిందట.
ఇకనేం, రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతుంది. పెరిగిపోయిందట కూడా.! ప్రస్తుతం కోటి వరకూ సాక్షి వైద్య డిమాండ్ చేస్తోందట. నిజమేనా.? అంటే, ట్రెండ్‌ని బట్టే అవకాశాలు.. వాటితోపాటే పెరుగిపోతాయ్ రెమ్యునరేషన్లు.. అన్నది సినీ పరివ్రమలో ప్రముఖంగా వినిపిస్తున్నమాట.
సాక్షి వైద్య, సాయి మంజ్రేకర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్స్‌గా మారుతున్నారు తెలుగు సినీ పరిశ్రమలో. మరీ కోటి కాదుగానీ.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ ఇద్దరికీ రెమ్యునరేషన్ పలుకుతోందిట.