ఇండస్ట్రీ టాక్ : అఖిల్ నెక్స్ట్ కి షాకింగ్ బడ్జెట్??

ఈ ఏడాదిలో టాలీవుడ్ సినిమా డెలివర్ చేసిన భారీ హిట్ చిత్రాలతో పాటుగా పలు కోలుకోలేని భారీ డిజాస్టర్ లు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో అక్కినేని వారి యంగ్ హీరోలు నటించిన సినిమాలు కూడా ఉండగా ఈ చిత్రాల్లో అఖిల్ అక్కినేని నటించిన భారీ చిత్రం “ఏజెంట్” కూడా ఒకటి.

అయితే ఈ సినిమాని అనిల్ సుంకర అఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించి చేతులు కాల్చుకున్నారు. అయితే ఇంత రిస్క్ తర్వాత కూడా అఖిల్ చేయబోయే తదుపరి సినిమాకి రికార్డు బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనితో అయితే అఖిల్ నెక్స్ట్ సినిమాని ప్రముఖ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నట్టుగా టాక్ వచ్చింది.

కాగా ఇపుడు వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ చిత్రానికి భారీ బడ్జెట్ 100 కోట్లు మేర పెడుతున్నారని అంటున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే అంత సత్తా ఉందో ఏమో కానీ అఖిల్ కెరీర్ లో మాత్రం మరో షాకింగ్ మొత్తం ఇది అని చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు మున్ముందు రావాల్సి ఉన్నాయి.

కాగా ఇప్పుడు అఖిల్ మాత్రం ఏజెంట్ షాక్ నుంచి బ్రేక్ లోనే ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమా అనౌన్సమెంట్ కోసం ఫ్యాన్స్ కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే తాను ఏజెంట్ విషయంలో చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలని కాస్త లేట్ అయినప్పటికీ మంచి సినిమా చేయాలని చూస్తున్నాడు అట.