ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ హైప్ ఉన్న చిత్రాల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నా సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి మరి ఈ చిత్రం రిలీజ్ విషయంలో అయితే ఎప్పటి నుంచో సస్పెన్స్ నడుస్తుండగా..
ఈ చిత్రం రిలీజ్ కోసం అయితే ఫ్యాన్స్ ఇప్పుడు నుంచే ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ మాత్రం కాస్త స్లో గానే కొనసాగుతుంది కానీ ఇప్పటివరకు 40 శాతం మేర షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా షూటింగ్ ఇలా నడుస్తుండగా నెక్స్ట్ ఈ చిత్రం రిలీజ్ పై మాత్రం గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ సహా బాలీవుడ్ సినీ వర్గాల్లో కూడా మంచి బజ్ అయితే నడుస్తుంది.
దీనితో ఈ చిత్రం వచ్చే ఏడాదిలో దాదాపు మార్చ్ రిలీజ్ కి తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి మొదటి చిత్రంలా కాకుండా పక్కా ప్లానింగ్ ప్రకారం హిందీ మార్కెట్ లో సినిమాని తీసుకెళ్లే ప్లానింగ్ లు చేస్తున్నట్టుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.
మరి ఈసారి పుష్ప 2 అనుకున్న సమయానికి వస్తుందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరింత మంది బిగ్ స్టార్స్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ రిలీజ్ ని తీసుకొచ్చే ప్లానింగ్ చేస్తున్నారు.