బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయసులోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ ఇటీవల తన చిరకాల ప్రేమికుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట అటు వారి కెరీర్ లోను, పర్సనల్ లైఫ్ లోను ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి జరిగిన కొంతకాలానికి ఈ దంపతులు వారి అభిమానులకు గుడ్ న్యూస్ షేర్ చేశారు. ప్రస్తుతం అలియా ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా సినిమా షూటింగులు, టీవీ షోస్ లో పాల్గొంటూ బిజీగా ఉంది.
ఇటీవల ఈ జంట కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నారు. ఈ షోలో వీరిద్దరూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఆలియా తన అభిమాని హీరో గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోస్ గురించి కామెంట్ చేయాలని కోరగా.. నాకు ఫేవరెట్ హీరో రణవీర్ సింగ్ గురించి నేను నెగటివ్ కామెంట్స్ చేయలేను అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా ఇలాంటి ప్రశ్నలు భరించడం కూడా నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది. రణవీర్ సింగ్ నాలాగా ఎంతోమందికి అభిమాన హీరో. ఆయన ఎన్నో మంచి సినిమాలలో నటించాడు. అలాంటి రణవీర్ సింగ్ ని మనం తిరిగి ప్రేమించాలి అంటూ ఆలియా చెప్పుకొచ్చింది.
అయితే ఇటీవల ఆలియా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ విషయంలో కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆలియా, రణబీర్ కపూర్ ఇద్దరు ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇటీవలే రణబీర్ కపూర్ షంషేరా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా రణబీర్ యానిమల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక ఆలియా విషయానికి వస్తే… ప్రస్తుతం ఆలియా డార్లింగ్స్, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాలలో నటిస్తుంది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటిస్తున్నారు.