ఖరీదైన లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. దాని ధర ఎంతో తెలుసా..?

బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలలో తలదూర్చి అనునిత్యం వివాదాల్లో నిలుస్తుంది . ఇటీవల కాలంలో కంగనా అందరి మీదా విమర్శలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కంగనా నటించిన ధాకడ్ సినిమా మే 20 వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది. ఈ సినిమ మంచి టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకులు సినిమా చూడటానికి క్యు కడుతున్నారు. ఈ సినిమాలో కంగనా ఏజెంట్ అగ్ని అనే బోల్డ్ డిటెక్టివ్ పాత్రలో నటించింది.

కంగనా ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచారు. ధాకడ్ సినిమా ప్రీమియర్ షో చూడటానికి కంగనా తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త కార్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆమె కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల ఐదు కోట్ల విలువ చేసే ఖరీదైన మెర్సిడెస్ మేబాక్ ఎస్680 మోడల్ కారు కొనుగోలు చేసింది. వైరల్ అవుతున్న వీడియోలలో ఉన్న బ్లాక్ కార్ పక్కన కంగనా బ్లాక్ కలర్ ఫ్లోరల్ డ్రెస్సులో కార్ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఇదిలా ఉండగా ధాకడ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా కంగనా పలు ఇంటర్వ్యూలకు హజరయ్యింది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూ లో కంగనా బాలీవుడ్ యాక్టర్స్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూ లో భాగంగా రిపోర్టర్ మాట్లాడుతూ..బాలీవుడ్ సెలబ్రిటీలలో ఏ ముగ్గురిని మీ ఇంటికి కాఫీ కి ఇన్వైట్ చేస్తారు అని ప్రశ్నించగా.. బాలీవుడ్ స్టార్స్ లో ఎవరికి నా ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు అని చెప్పింది. ఇలాంటి వివాదాస్పద వాక్యాలు చేస్తూ కంగనా తరచు వివాదాల్లో నిలుస్తుంది.