Hari Hara Veera Mallu: టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. మొదట ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా ఆ తర్వాత క్రిష్ కొన్ని కారణాల వల్ల తప్పు పోవడంతో జ్యోతి క్రిష్ణ వహించారు. దాదాపుగా ఐదేళ్ల నుంచి ఊరిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని దాదాగా నేడు ఒక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది.
ఇకపోతే సినిమా విడుదలకు ఇందులో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్ వీరి చుట్టే కథ తిరుగుతుంది. అయితే గతంలో ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ పేర్లు వినిపించాయి. హరిహర వీరమల్లు సినిమాలో మొదట బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని ఒక పాత్ర కోసం తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెని తప్పించి నోరా ఫతేహిని తీసుకున్నారు. అలాగే నర్గిస్ ఫక్రిని కూడా తీసుకున్నారు అని వార్తలు వినిపించాయి.
చిత్ర బృందం కూడా పలుమార్లు నోరా ఫతేహి పేరు ప్రస్తావించింది. ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని అన్నారు. కానీ తీరా చూస్తే సినిమాలో ఈ ఇద్దరూ లేరు. నేడు ఈ సినిమా విడుదల అయ్యింది. కానీ ఎక్కడా కూడా నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి కనిపించలేదు. నోరా ఫతేహితో షూటింగ్ కూడా చేసాం అన్నారు కానీ హరిహర వీరమల్లు సినిమాలో ఆమె ఎక్కడా కనపడలేదు. అయితే సెకండ్ పార్ట్ కి సంబంధించి 30 శాతం షూటింగ్ అయిపోయింది అన్నారు కాబట్టి అందులో ఉంటుందేమో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇక నర్గిస్ ఫక్రి ఔరంగజేబు చెల్లెలి పాత్రలో కనిపించాలి. కానీ సినిమాలో కనిపించలేదు. దీంతో ఆమె కూడా సెకండ్ పార్ట్ లో కనిపిస్తారేమో అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఈ సినిమా నుంచి నర్గీస్ పక్రి, నోరా ఫతేహి లను తీసేసారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారని మూవీ యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ ఆయన కూడా సినిమాలో కనిపించలేదు. మరి వీళ్ళ సీన్స్ ని ఎడిటింగ్ లో తీసేసారా? లేక సెకండ్ పార్ట్ లో ఉంటారా చూడాలి మరి.
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు మూవీలో కనిపించని బాలీవుడ్ భామలు.. వారిని మూవీ నుంచి తీసేసారా?
