Bramhasthra : బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మస్త్ర. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలీయాభట్ ప్రధాన పాత్రల్లో నటించారు.బ్రహాస్త్రం ..శివం మొదటి భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.తెలుగులో ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. అందుకే ఈ సినిమాకు టూలీవుడ్ లో కూడా అంచనాలు భారీగా వున్నాయ్.
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవలే వారణాసిలోని కాశీలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు..తమిళ్..మలయాళం..కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.అన్ని పనులు పూర్తిచేసి థియేటర్లో సెప్టెంబర్ 9న ఇదే ఏడాది భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి రణ్‌బీర్, ఆలీయా కలిసి ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.మూడు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం ‘శివ’.
బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ మీడియాలో ‘ప్రేమ అంటే కాంతి. బ్రహ్మాస్త్రలోని మొదటి అధ్యాయాన్ని పార్ట్ 1: శివ అని చాలా కాలంగా మనం పిలుస్తున్నాం. కానీ పార్ట్ 1 అంటే ప్రేమ. ఎందుకంటే బ్రహ్మాస్త్ర ప్రధానాంశం ప్రేమకు ఉన్న శక్తికి సంబంధించినది. ఈ ప్రేమ అగ్నిలా అన్నివైపులా వ్యాపించి సినిమాను దాటి నిజ జీవితంలోకి అడుగుపెట్టింది. ఇదిగో మా లవ్ పోస్టర్. దీనికి సరైన సమయం ఇదే అనిపిస్తుంది’ అంటూ రణ్‌బీర్, ఆలీయాల పోస్టర్‌ను షేర్ చేశాడు.