బిగ్ బ్లాస్ట్ : మాస్ పోస్టర్ తో “వాల్తేరు వీరయ్య” రాకకి డేట్ ఖరారు.!

ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు సాలీడ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ మరో హీరోగా గెస్ట్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై అనేక అంచనాలు అయితే నెలకొనగా ఈరోజు ఈ చిత్రం నుంచి రిలీజ్ డేట్ అప్డేట్ ని అయితే మేకర్స్ రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు.

మరి ఇప్పుడు అయితే ఈ క్రేజీ అప్డేట్ ని సరిగ్గా 4 గంటల 5 నిమిషాలకి అయితే రివీల్ చేసేసారు. మరి మొదటి నుంచి చెప్తున్నట్టే జనవరి 13 డేట్ తో వస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. మరి దీనిపై మెగాస్టార్ పై ఓ అదిరే పోస్టర్ ని డిజైన్ చేయగా అందులో అయితే మెగాస్టార్ కంప్లీట్ మాస్ గా ఓ మత్స్యకారునిగా కనిపిస్తున్నారు.

సముద్రంలో బోట్ పై, హనుమాన్ జెండా లతో మెగాస్టార్ అదరగొట్టేశారని చెప్పొచ్చు. మొత్తానికి అయితే వాల్తేరు వీరయ్య జనవరి 13 నుంచి తన దమ్ము చూపించనున్నాడని చెప్పాలి. ఈ సినిమా విషయంలో అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ అవైటెడ్ సినిమాలో అయితే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మేకర్స్ నిర్మిస్తున్నారు.