నా సత్తా ఏందో చూపిస్తనంటున్న బిత్తిరోడు..!

బిత్తిరి స‌త్తి అలియాస్ చేవెళ్ల ర‌వి కుమార్ తన హావాభావాలతో, బిత్తిరి చేష్టలతో అందరికి అర్ధమయ్యే యాసలో V6 న్యూస్ ఛానల్‌లో తీన్మార్ వార్తలను చెబుతూ మనందరిని అలరిస్తూ వచ్చిన బిత్తిరి సత్తి ఆ తరువాత టీవీ9లో చేరి ఇస్మార్ట్ న్యూస్‌లో అదరగొట్టాడు.

అయితే టీవీ9 యాజమాన్యంతో ఏర్పడిన విబేధాల కారణంగా ఇటీవల బిత్తిరి సత్తి ఆ ఛానల్‌కి రాజీనామా చేసి సాక్షి ఛానల్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే తన మార్క్ కామెడీతో కొత్త ప్రోగ్రామ్ ద్వారా సత్తి సాక్షిలో కనబడనున్నాడు. అయితే కొత్త ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా బయటికొచ్చింది.

ఈ ప్రోమోలో డబుల్ వేరియేషన్‌లో కనిపించిన బిత్తిరి సత్తి డైలాగ్‌లతో చించేశాడు. అందరికి “ఇయల ఫాదర్స్‌డే కానీ నాకు ఒక్కనికే ప్రాబ్లంస్ డే” అని అన్నాడు. నా మనసాక్షి చెబుతుంది బిడ్డా ఇది తండ్రిని గౌరవించే జాగ ఇక నీకు తిరుగులేదు, యాడికి తిరిగేది లేదు అని తండ్రి గెటప్‌లో ఉన్న సత్తి అన్నాడు. ఇక సత్తిగాని సత్తా ఏందో చూపిస్తా నాయన అంటూ జనం గుండెల్లో నాకింత జాగిచ్చిర్రు ఇక గుండీలు ఇప్పుకుని తిరుగుతా అని కాలర్ ఎగరేశాడు మన బిత్తిరి సత్తిగాడు.