రెండు ప్రధాన పత్రికల్లో బ్యానర్ ఐటమ్ హెడ్డింగ్ ఒకేలా రావడం అనేది చాలా చాలా అరుదైన విషయం. జాతీయ, అంతర్జాతీయ సంబంధిత సంఘటనలు, క్రికెట్ వంటి విషయాల్లోనూ చాలా చాలా అరుదుగా ఒకే హెడ్డింగులు ప్రధాన మీడియా సంస్థల్లో కనిపించొచ్చు. నిజానికి, అలా కనిపించకుండా వుండేందుకు తగిన యంత్రాంగాలు ఆయా మీడియా సంస్థల్లో వుంటాయ్.
కానీ, ఒక రాజకీయ పరమైన అంశం విషయంలో ఈనాడు, సాక్షి పత్రికల్లో ఒకే బ్యానర్ హెడ్డింగ్ వచ్చింది. ‘ఎమ్మెల్యేలకు ఎర!’ అన్నది ఆ హెడ్డింగ్. జస్ట్ ఫాంట్ మాత్రమే డిఫరెన్స్. ఒకరు ఆశ్చర్యార్థకం పెడితే, ఇంకొకరు క్వశ్చన్ మార్క్ పెట్టారు.
‘అప్పుడప్పుడూ వీళ్ళకిలా ఏకాభిప్రాయం వుంటుంది..’ అని నెటిజనం ఈ వ్యవహారంపై సెటైర్లేసుకుంటున్నారు.నిజమే మరి, ఈనాడు – సాక్షి పత్రిల్ని చూస్తే.. రాజకీయ విరోధుల్లా కనిపిస్తుంటాయి. ఈనాడు టీడీపీ అనుకూల మీడియాగా ముద్ర వేయించుకుంది. సాక్సి ఎలాగూ వైసీపీ సొంత పత్రిక.
ఇంకో ఆసక్తికరమైన విషయమేంటటే, టీడీపీ అనుకూల మీడియాని పచ్చ మీడియాగా చెప్పుకుంటూ, సాక్షి పత్రిక తన లోగో బ్యాక్‌గ్రౌండ్‌గా ఆ పచ్చ రంగునే వేసుకుంటుంటుంది. వైసీపీ పుట్టకముందు నుంచే ఈనాడు లోగో బ్లూ కలర్‌లో ప్రారంభమయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనేయడానికి బీజేపీ ప్రయత్నించిందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అటు ఈనాడు, ఇటు సాక్షి.. ఒకే హెడ్డింగ్ పెట్టుకున్నాయి. నిత్యం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే సాక్షి – ఈనాడు.. ఇలా ఏకాభిప్రాయానికి రావడం వింతే మరి.!