‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్ విడుదల..

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న నెంబ‌ర్ వ‌న్ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ప్రేక్ష‌కులంద‌రినీ ఆక‌ట్టుకుంటూ అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేలా వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో అందించే బ‌హృత్త‌ర కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టింది. ప్రాంతీయ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసేలా అసాధార‌ణ‌మైన కంటెంట్‌ను అందిస్తోంది ఆహా. ఆ క్ర‌మంలో డార్క్ కామెడీతో రూపొందిన ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆహాలో విడుద‌ల చేశారు. దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన కథాంశాల‌ను అందించే ఆహా .. స‌త్తిగాని రెండెక‌రాలు సినిమా ట్రైల‌ర్ ఈవెంట్‌తో మ‌రో మైల్ స్టోన్‌ను చేరుకుంది.

‘సత్తిగాని రెండెకరాలు’ సినిమా కథ విషయానికి వస్తే తెలంగాణలోని ఓ చిన్న ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది. అందులో ఆటో న‌డుపుతూ కుటుంబాన్ని పోషించే తండ్రికి ఓ స‌మ‌స్య వ‌స్తుంది. త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ల‌ను దాటి త‌న కూతురిని ఎలా కాపాడుకున్నాడ‌నేదే. సినిమా అంతా హాస్యంతో సాగుతూనే కావాల్సినంత నాట‌కీయ‌త‌ను క‌లిగి ఉంటుంది. న‌టీన‌టులంద‌రూ త‌మ అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తార‌న‌టంలో సందేహం లేదు. మే 26న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనే ధృడ సంక‌ల్పం, ధైర్యం వంటి అంశాలు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటాయి.

అభిన‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పాన్ ఇండియా మూవీ పుష్ప‌లో అద్భుత‌మైన న‌ట‌న‌తో మెప్పించిన జ‌గ‌దీష్ ప్ర‌తాప్ భండారి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఇంకా వెన్నెల కిషోర్‌, అనీషా దామా, బిత్తిరి స‌త్తి, మోహ‌నశ్రీ సురాగ‌, త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌బోతున్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీష్ ప్ర‌తాప్ భండారి మాట్లాడుతూ ‘‘మంంచి డార్క్ కామెడీతో పాటు హృద‌యాల‌ను తాకే భావోద్వేగాల మిళిత‌మైన ‘స‌త్తిగాని రెండెక‌రాలు’ చిత్రంలో నటించటం చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి టీమ్‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ద‌క్కింది. గ్రిప్పింగ్ నెరేష‌న్‌తో సాగే ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ ‘‘‘సత్తిగాని రెండెకరాలు’ చిత్రాన్ని ఆహాలో రిలీజ్ చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు నాణ్య‌మైన అద్భుత‌మైన ప్రాంతీయ‌ కంటెంట్‌ను అందించాల‌నే మా నిబ‌ద్ధ‌త ఈ సినిమాతో తెలుస్తుంది. డిఫ‌రెంట్ స్టోరీ టెల్లింగ్, డార్క్ కామెడీతో రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్ మ‌న‌సుల్లో బ‌ల‌మైన ముద్ర వేస్తుంది’’ అన్నారు.

డార్క్ కామెడీతో రూపొందిన ‘సత్తిగాని రెండెకరాలు’ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో స్నీక్ పీక్‌ను కూడా విడుద‌ల చేశారు. దీని ద్వారా సినిమా ఎంత కామెడీ ఆక‌ట్టుకుంటుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేశారు. ఈ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో చిత్ర టీమ్‌, యూనిట్‌, మీడియా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈవెంట్‌లో ప్ర‌ద‌ర్శించిన గ్లింప్స్‌తో మూవీ గ్రిప్పింగ్ నెరేష‌న్‌తో పాటు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో న‌టీన‌టులు మెప్పిస్తార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ప్రాంతీయ సినిమాలోని గొప్పతనాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌టంతో పాటు టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్స్ వారి విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల‌ను తెలియ‌జేయ‌టానికి కావాల్సిన వేదిక‌ను అందిస్తూ ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌టంలో త‌న‌దైన పాత్ర‌ను పోషిస్తోంది ఆహా. విభిన్నమైన, ఆకర్షణీయమైన క‌థాంశాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటూ అంద‌రినీ ఓ చోట చేర్చ‌టంలో ఆహా కీల‌క త‌న‌దైన పాత్ర‌ను పోషిస్తుంది.

మే 26న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సత్తిగాని రెండెక‌రాలు’ చిత్రాన్ని మిస్ కాకండి.

Sathi Gani Rendu Ekaralu Trailer | Jagadeesh Prathap, Vennela Kishore | ahavideoIN