ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న బింబిసారా… స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..?

నందమూరి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార . ఆగస్టు 5వ తేదీన ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫాంటసీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్ర అభినయం చేయగా.. సంయుక్త మీనన్, కేథరిన్ కథానాయికలుగా నటించారు. ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది.

చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా తన జీవితంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటిటి విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ఓటీటీ లో విడుదల కానుందని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి విడుదల గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ బింబిసారా సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ 5 లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల అయింది. ఈ క్రమంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. జీ 5 సంస్థ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. కింద ఒకడు ఉన్నాడు, వాడి పేరు బింబి, త్రిగర్తల సామర్జ్యాధిపతి బింబిసారుడు అని చెప్పండి!!! అంటూ రాసుకొచ్చింది. ఇక బింబిసారా ఓటిటి విడుదల తేదీ ఖరారు అవటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.