బిగ్‌బాస్ 4:డైరెక్ట్‌గా ఫినాలేకు వెళ్ళే అవ‌కాశం ఇచ్చిన బిగ్ బాస్‌.. కుమ్ములాడుకున్న హౌజ్‌మేట్స్

సీజ‌న్ ముగుస్తున్న కొద్ది బిగ్ బాస్ 4 ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్‌ల‌తో హౌజ్‌మేట్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎవ‌రి స‌త్తా ఏంటో తెలుసుకోవాల‌ని , టైటిల్ గెలిచే అర్హ‌త ఎవ‌రికి ఉంద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గేమ్ మ‌రో 3 వారాలు మాత్ర‌మే మిగిలి ఉండ‌డంతో బిగ్ బాస్ ఈ రోజు టిక్కెట్ టూ ఫినాలే అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో గెలుపొందిన వారు డైరెక్ట్‌గా ఫైన‌ల్‌లోకి వెళ్లిపోవ‌చ్చు. ఏడుగురు పోటీ దారుల‌లో ఎవ‌రు ఈ టాస్క్‌లో గెలుపొంది ఆ అరుదైన అవ‌కాశం అందుకుంటారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

నేటి ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుద‌ల చేశారు బిగ్ బాస్ 4 . ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ఓ టాస్క్ ఇచ్చారు. టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఓ ఆవుని ఉంచి అది అరిచిన‌ప్పుడు పాలు వ‌స్తాయి వాటిని ఎవ‌రైతే ఎక్కువ ప‌ట్టి డ‌బ్బాలో నింపుకుంటారో వాళ్లే విజేత‌లుగా నిలుస్తార‌ని బిగ్ బాస్ చెప్పారు. వారికి టిక్కెట్ టూ ఫినాలే ద‌క్కుతుంద‌ని బిగ్ బాస్ చెప్తారు. బ‌జ‌ర్ మోగిన వెంట‌నే ఉరుక్కుంటూ వెళ్లి డబ్బాలు నింపుకున్నే ప్ర‌య‌త్నం చేశారు హౌజ్‌మేట్స్. అయితే ఇది ఒక‌ర‌క‌మైన ఫిజిక‌ల్ టాస్క్ కావ‌డంతో సోహైల్ రెచ్చిపోయాడు

దూకుడుతో పాలు నింపుకునేందుకు సోహైల్ ప్ర‌య‌త్నం చేయ‌గా, అవినాష్ పాల డ‌బ్బా ప‌గిలింది. దీంతో అవినాష్ ఫుల్ ఫైర్ అయ్యాడు. న‌న్ను అంద‌రు టార్గెట్ చేశారు. ఇంట్లో నుండి పంపించాల‌ని చూస్తున్నారంటూ బిగ్ బాస్ ద‌గ్గ‌ర మొర పెట్టుకున్నాడు. సోహైల్‌, అవినాష్ గట్టిగా గ‌ట్టిగా అరిచే ప్ర‌య‌త్నం చేసుకోగా, మ‌ధ్య‌లో అఖిల్ వ‌చ్చి వారించే ప్ర‌య‌త్నం చేశాడు. ప్రోమో చూస్తుంటే టిక్కెట్ టూ ఫినాలే టాస్క్ చాలా రంజుగా సాగేలా క‌నిపిస్తుంది. ఇక ఈ వారం ఇంట్లో ఏడుగురు స‌భ్యులు ఉండ‌గా, వారిలో అఖిల్, మోనాల్‌, అవినాష్‌, హారిక , అభిజీత్‌లు నామినేష‌న్ లో ఉన్నారు.