బిగ్ బాస్ 4: అఖిల్‌పై రాహుల్ సంచ‌ల‌న కామెంట్స్.. మండిప‌డుతున్న ఫ్యాన్స్

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 రాను రాను ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. విచిత్ర‌మైన టాస్క్‌లు ఇస్తూ హౌజ్‌మేట్స్‌ని ఇరిటేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. టాప్ 5లో నిల‌వాలంటే అన్నింటిని ఓపిక‌గా భ‌రిస్తూ ఉండాల్సిందే.మ‌రి. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఏడుగురు స‌భ్యులు ఉండ‌గా, వారిలో అఖిల్, అభిజిత్, సోహైల్, మోనాల్ ,అరియానా టాప్‌5 లో ఉంటార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. కొంద‌రేమో అఖిల్ ఈ వారం ఎలిమినేట్ అవుతాడంటూ జోస్యాలు చెబుతున్నారు.

బిగ్ బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ అఖిల్ ఆట గురించి, ఆయ‌న ఏ స్థానంలో ఉంటాడ‌నే విష‌యంపై నోరు విప్పాడు . ఈ సీజ‌న్‌లో అభిజీత్‌, సోహైల్‌ల‌లో ఒక‌రు విజేత‌గా నిలిచే ఛాన్స్ ఉంది. వారిద్ద‌రు కాలేదు అంటే అరియానా అవుతుంది అని రాహుల్ చెప్పాడు. అఖిల్ ఎందుకు కాలేక‌పోతున్నాడు అనే విష‌యం గురించి మాట్లాడిన రాహుల్‌.. అఖిల్ ఓ సంద‌ర్భంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని బ‌య‌ట‌కు పంపి, వీక్ కంటెస్టెంట్స్‌తో ఏం చేస్తారు అని అన్నాడు. అలానే మేకు ప్రోటీన్స్‌ని తిని పులిలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని అభిజీత్ అన్న విష‌యం కూడా కొంచెం అఖిల్‌కు మైన‌స్ అయిందని రాహుల్ చెప్పుకొచ్చాడు.

చివ‌రి రోజుల‌లో అఖిల్ కూడా మీలా పుంజుకొని బిగ్ బాస్ విన్న‌ర్ అయ్యే అవ‌కాశం లేదా అని యాంక‌ర్ ప్ర‌శ్నించగా, అందుకు స‌మాధానం ఇచ్చిన రాహుల్‌.. ఆ స‌మ‌యం దాటిపోయిందంటూ మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టాడు. అఖిల్ విన్న‌ర్ కాడంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో దీనిపై స్పందించిన నెటిజ‌న్స్ రాహుల్‌పై మండిప‌డుతున్నారు. అఖిల్ త‌ప్ప‌క విజయం సాధిస్తాడంటూ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.