Home News బిగ్ బాస్ 4: సీన్ రివర్స్..ఓటింగ్ టాప్‌లో మోనల్..అఖిల్ కథ కంచికేనా !

బిగ్ బాస్ 4: సీన్ రివర్స్..ఓటింగ్ టాప్‌లో మోనల్..అఖిల్ కథ కంచికేనా !

బిగ్ బిస్ తెలుగు సీజన్ 4 ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. ఇప్పుడు వరకు సరైన మద్దతు లేని, ఎంతో ట్రోలింగ్‌కు గురైన మోనాల్ గజ్జర్ అనూహ్యంగా పుంచుకుంది. బలం అనేది ప్రదర్శించేది కాదు సమయం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది అన్న ప్రభాస్ సినిమాలోని డైలాగ్ మాదిరిగా..అసలైన మోనాల్ అంటే ఇప్పుడు వీక్షకులకు తెలుస్తోంది. ఇప్పటివరకు మీసాలు మెలేసిన వాళ్లకు, తొడలు చరిచిన వాళ్లకు, తామే బిగ్ బాస్ విన్నర్లం అని కలర్ ఇచ్చినవాళ్లకు వరుస షాకులు ఇస్తోంది. ముఖ్యంగా అఖిల్ కు ఓ రేంజ్ లో కౌంటర్లు వేస్తోంది.

Akhi Monal | Telugu Rajyam

కుటుంబ సభ్యులు, ఆత్మీయులు వచ్చి ఎప్పుడైతే టాప్ 5 కంటెస్టెంట్లను సెలక్ట్ చేశారో, అప్పట్నుంచి మోనల్ గేమ్ లో మార్పు వచ్చింది. అభిజిత్ ఫాదర్, తన మదర్ తప్పితే ఎవరూ మోనల్ ను టాప్ 5 కి వస్తుందని చెప్పలేదు. దీంతో స్పీడు పెంచింది. మీసాలు తిరిగిన మగాళ్ల అహాలను దెబ్బతీసేలా తన భుజ బలాన్ని ఉపయోగించి హారికను కెప్టెన్ చేసింది. ఇప్పటిదాకా మోనల్ కు ఎవరు ఓట్లు వేస్తున్నారన్నది మిస్టరీనే. హౌస్ లో మసాలా కోసం బిగ్ బాస్ మోనాల్ ను సేవ్ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. చాలా మంది నెటిజన్లు కూడా ఈ వాదనను బలంగా నమ్మారు. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్. ఎవరో ఒకరి వెనుక షాడోగా ఇన్నాళ్లు ముందుకెళ్లిన మోనాల్..ఇప్పుడు మాత్రం తన ఆట ఏంటో చూపిస్తోంది.

సోమవారం నాటి నామినేషన్స్‌లో అఖిల్-మోనాల్‌ల మధ్య ఓ రేంజ్ డిస్కషన్ నడిచింది. ఈ చర్చ ద్వారా మోనాల్ ను అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు బచాయించిన అఖిల్ కథ కంచికే అని అర్థం అవుతుంది. గతంలో తనతో సఖ్యతగానే ఉంటూ రెండుసార్లు నామినేట్ చేసిన అఖిల్‌కి షాక్ ఇచ్చింది మోనాల్. 12 వ వారం నామినేట్ అయిన అఖిల్.. తనకి బదులుగా మరొకరు నామినేట్ చేసుకునే అవకాశం కోసం మోనాల్‌ ఒప్పించే ప్రయత్నం చేసినా..అందుకు రెడీగా లేనని తెగేసి చెప్పింది. మొత్తానికి 12వ వారం నామినేషన్స్‌లో అరియానా, మోనాల్, అఖిల్, అవినాష్‌లు నిలిచారు. ఈ నలుగురిలో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ కాబోతున్నాయి.

అయితే ప్రజెంట్ ఓటింగ్ ట్రెండ్ నుంచి ఊహించని సమాచారం అందింది. అభిజిత్‌ -హారిక ఫ్యాన్స్ అంతా గంపగుత్తగా మోనల్ కు ఓట్లు వేస్తున్నారు. దీంతో అఖిల్ పూర్తిగా వెనకబడ్డాడు. మోనాల్‌కి దాదాపు 50 శాతం ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.. 25 శాతం ఓట్లతో అఖిల్ సెకండ్ ప్లేసులో ఉన్నాడు. అయితే అరియానా 15 శాతం ఓట్లతో మూడోస్థానంలో ఉండగా.. అవినాష్ 10 శాతం ఓట్లతో ప్రమాదపు అంచున ఉన్నాడు. నేటి ఎపిసోడ్ లో ట్విస్ట్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్. టాస్క్ ద్వారా ఒకరికి సేవ్ అయ్యే ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఏం జరుగుతుందో.. లెట్స్ వెయిట్ అండ్ సీ.

- Advertisement -

Related Posts

” ఫస్ట్ ఆ ఎన్నికలు , తరవాత ఈ ఎన్నికలు ” ప్రకటించేసిన జగన్, ఎవ్వడైనా సైలెంట్ అయిపోవాల్సిందే !

గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆయనను ఒక ప్రభుత్వ అధికారి కంటే కూడా...

విజయవాడ దుర్గ గుడికి వెళ్ళే ప్రతీ ఒక్కరికీ సూపర్ గుడ్ న్యూస్

నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో నిన్న జరిగిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానాలు (టీటీడీ), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ (గోపూజ) నిర్వహిస్తున్నారు....

ఆ విషయంలో ఎన్నడూలేనంత కంగారు పడుతున్న వైఎస్ జగన్?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయటం, జరపలేమంటూ అధికార ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళటం, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు...

అలా ఎమోషనల్.. చిట్టి చెల్లితో రష్మిక ఆటలు

రష్మిక మందాన్నకు ఓ చిట్టి చెల్లి ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ మధ్య తెగ సెటైర్లు వచ్చాయి. రష్మిక మందాన్న ఏజ్‌కు, తన చెల్లి ఏజ్‌కు మధ్య అంత గ్యాప్...

Latest News