Harika: యూట్యూబర్‌గా పరిచయం అయ్యి ఆ తరువాత బిగ్‌బాస్ 4 ఫేమ్‌తో దేత్తడి హారిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్, కామెడీ వీడియోలతో ఆకట్టుకుంటున్న హారిక, దేత్తడి అనే పదాన్నే ఇంటి పేరుగా మార్చుకుని పాపులర్ అయిపోయింది. ఇచ్చిపడేస్తా అనే ఊత పదంతో బిగ్‌బాస్ సీజన్ 4లో పేరు తెచ్చుకున్న ఈమె, చివరి వరకూ తన పోరాటాన్ని సాగించి ఔరా అనిపించుకుంది. తెలంగాణ యాసతో తెలుగువారికి దగ్గరైన దేత్తడి హారిక అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకుని, బిగ్‌బాస్ ద్వారా మరింత ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
ఇకపోతే వినూత్న ఆలోచనలతో, డిఫరెంట్ కంటెంట్ వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఈమెకు అందం, అభినయం లాంటి లక్షణాలున్నా వెండితెరపై మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోకపోవడానికి కారణం ప్రధానంగా ఆమె పొట్టిగా ఉండడమే అని టాక్. అది అక్కడితో ఆగకుండా నెటిజన్లు సైతం ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండడం ప్రధానం అంశం.
దీనిపై తాజాగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఆమె పెట్టిన పోస్టులకు చాలామంది బుడ్డది, పొట్టిది అని పెడుతున్న కామెంట్లను చూసి విసిగిపోయిన హారిక అలా కామెంట్ చేసే వాళ్లకు గట్టి సమాధానమే చెప్పింది. అలా తనని ఎవరైనా కామెంట్ చేస్తే ఏమవుతుందో ఆమె ఓ సినిమా డైలాగ్ ద్వారా అందరికీ గుర్తుండేటట్టు చెప్పింది. ‘ఎవడు పడితే వాడు.. బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు ఊడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఒక అర్హత ఉండాలి లేదా నా అభిమాని అయ్యి ఉండాలి’.. అంటూ రామయ్య వస్తావయ్యా సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌నే హారిక అస్త్రంగా వాడుకొని అలా కామెంట్ చేసే వాళ్లకు గట్టి జవాబే చెప్పిందని చెప్పవచ్చు. ఆ సినిమా అప్పట్లో పెద్దగా ఆడకపోయినా ఆ డైలాగ్ మాత్రం చాలా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా అదే డైలాగును దేత్తడి హారిక ఇలా వాడడంతో మళ్లీ ఈ డైలాగ్ ఓ ట్రెండింగ్‌గా మారిపోయింది.