బిగ్ బాస్ 4: ఓటింగ్ తారుమారు.. అభీని వెన‌క్కు నెట్టి టాప్ పొజీష‌న్‌లోకి వ‌చ్చిన మ‌హిళా కంటెస్టెంట్

Bigg Boss says we are proud to have such a mature member in the house

బిగ్ బాస్ సీజ‌న్ 4 టైటిల్ విన్న‌ర్ ఎవ‌రు అవుతార‌నే ఆస‌క్తి ప్రతి ఒక్క‌రిలో ఉంది. రేప‌టితో ఓటింగ్ క్లోజ్ కానున్న నేప‌థ్యంలో ఓట్లు వేసే వారు త‌మ అభిమాన కంటెస్టెంట్స్‌కు తెగ ఓట్లు వేస్తున్నారు. అలానే క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు సెల‌బ్రిటీలు కూడా క్యాంపెయిన్ చేయడం విశేషం. ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఫైన‌లిస్ట్‌లు అఖిల్, సోహైల్, అరియానా, హారిక‌, అభిజీత్ ఉన్నారు. వీరిలో ఒక‌రు బిగ్ బాస్ ట్రోఫీ అందుకోనున్నారు. అదెవ‌రు అనే దానిపై సస్పెన్స్ నెల‌కొంది.

Bigg Boss says we are proud to have such a mature member in the house

నిన్న‌టి వ‌ర‌కు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరో అభిజీత్ నాలుగో సీజ‌న్ విన్న‌ర్ అంటూ తెగ ప్ర‌చారం చేశారు. ఆయ‌న ఫ్యాన్స్ అయితే ఏకంగా డిసైడ్ అయిపోయారు కూడా. కాని తాజా ప‌రిస్థితులు గ‌మనిస్తే మూడో స్థానంలో ఉన్న అరియాన ఏకంగా టాప్ పొజీష‌న్‌కు చేరింది. రెండు రోజుల నుండి అరియాన‌కు భీభ‌త్సంగా ఓటింగ్ పెరుగుతుంద‌ని, ఈ నేప‌థ్యంలో మూడో స్థానంలో ఉన్న అరియానా ప్ర‌స్తుతం టాప్ పొజీష‌న్‌కు చేరినట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. అరియానా దెబ్బ‌కు టాప్ లో ఉన్న అభిజీత్ రెండో స్థానానికి చేరాడ‌ని తెలుస్తుంది.

అరియానా తొలి స్థానంలో, అభిజీత్ రెండో స్థానంలో ఉన్నాడ‌ని వ‌స్తున్న వార్త‌ల‌ని కొట్టిపారేసిన వాళ్ళు లేక‌పోలేదు. అభిజీత్‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌డ‌మే కాదు నాగ‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నోయ‌ల్‌, లాస్య వంటి సెల‌బ్స్ కూడా బాగా స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అభిజీత్‌కే ఓటింగ్ ప‌ర్సంటేజ్ ఎక్కువ‌గా ఉంటుంది. కావాల‌నే అభిపై తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు అని ఆయ‌న ఫ్యాన్స్ అంటున్నారు. మ‌రి అస‌లు టైటిల్ విన్న‌ర్ ఎవ‌ర‌నేది తెలియాలంటే మ‌రో మూడు రోజులు ఆగ‌క త‌ప్ప‌దు. డిసెంబ‌ర్ 20న బిగ్ బాస్ సీజ‌న్ 4 ఫినాలే జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి గెస్ట్‌గా వ‌స్తార‌ని తెలుస్తుంది.